Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam Venu: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ‘బలగం వేణు’.? స్టార్‌ హీరోను డైరెక్ట్ చేసే..

సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా హీరో నాని.. ఫ్యాన్స్‌తో ట్విట్టర్‌ వేదికగా ముచ్చటించారు. 'ఆస్క్‌ నాని' పేరుతో సెషన్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాని ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాని ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Balagam Venu: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన 'బలగం వేణు'.? స్టార్‌ హీరోను డైరెక్ట్ చేసే..
Balagam Venu
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 06, 2023 | 8:44 AM

బలగం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన వేణు ఈ సినిమాతో తనలోని దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు. ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

ఇదిలా ఉంటే వేణు తన తదుపరి చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా వేణు నేచురల్ స్టార్‌ నానిని డైరెక్ట్ చేసే ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. స్వయంగా హీరో నానినే ఈ విషయాన్ని ప్రకటించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. నాని నటించిన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్నా’ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా గురువారం విడుదల కానుంది.

సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా హీరో నాని.. ఫ్యాన్స్‌తో ట్విట్టర్‌ వేదికగా ముచ్చటించారు. ‘ఆస్క్‌ నాని’ పేరుతో సెషన్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాని ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాని ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఓ అభిమాని ప్రశ్నిస్తూ.. ‘కొత్త డైరెక్టర్లలో మీరు ఎవరితో వర్క్ చేయాలని అనుకుంటున్నారు?’ అడిగారు. దీనికి బదులిచ్చిన నాని వెంటనే.. ‘బలగం డైరెక్టర్ వేణుతో సినిమా చేయాలని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు. దీంతో వేణు దర్శకత్వంలో నాని సినిమా చేయనున్నాడని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే వేణు సినిమాలో నటిస్తారా.? లేదా నిర్మాతగా వ్యవహరిస్తారా.? అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి.

నాని ట్వీట్..

ఇదిలా ఉంటే నాని చేసిన ట్వీట్‌పై వేణు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. బలగంతో ఊహించని విజయాన్ని అందుకున్న వేణు.. ప్రస్తుతం తన రెండో సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు. దిల్‌రాజు ప్రొడక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక నాని ప్రస్తుతం వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వేణు డైరెక్షన్‌లో నాని సినిమా ఉంటుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..