Manchu Manoj: ఇంతకీ ఆ తెల్ల పిల్ల ఎవరు.? తన రెండో పెళ్లి వార్తలపై స్పందించిన మంచు మనోజ్‌..

Manchu Manoj: ఇంటర్‌నెట్‌ పరిధి పెరిగిన తర్వాత రకరకాల వెబ్‌సైట్లు అందుబాటులోకి వస్తున్నాయి. అరచేతిలోకి విశ్వ వ్యాప్తంగా జరుగుతోన్న సమాచారం వచ్చేస్తోంది. అయితే..

Manchu Manoj: ఇంతకీ ఆ తెల్ల పిల్ల ఎవరు.? తన రెండో పెళ్లి వార్తలపై స్పందించిన మంచు మనోజ్‌..
Manchu Manoj

Edited By: Ravi Kiran

Updated on: Oct 27, 2021 | 6:20 AM

Manchu Manoj: ఇంటర్‌నెట్‌ పరిధి పెరిగిన తర్వాత రకరకాల వెబ్‌సైట్లు అందుబాటులోకి వస్తున్నాయి. అరచేతిలోకి విశ్వ వ్యాప్తంగా జరుగుతోన్న సమాచారం వచ్చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే అసలు నిజాల కంటే ఎక్కువగా ఫేక్‌ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మంచు వారబ్బాయి మనోజ్‌కు సంబంధించి ఇలాంటి ఓ వార్త హల్చల్‌ చేస్తోంది. 2015లో వివాహం చేసుకున్న మనోజ్‌ ఆ తర్వాత కొద్ది కాలానికే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఓ వెబ్‌సైట్‌లో మనోజ్‌ రెండో వివాహం విషయమై ఓ ఆర్టికల్‌ ప్రచురితమైంది. సదరు ఆర్టిక్‌ ప్రకారం.. మనోజ్‌ త్వరలోనే రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడని, ఓ ఫారెన్‌ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోనున్నాడని సారాంశం. దీంతో ఈ వార్త ఆ నోట, ఈ నోట పడి చివరికి మనోజ్‌ దృష్టికి వచ్చింది. దీంతో ఈ వార్తపై స్పందించిన మనోజ్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు.

సదరు ఫేక్‌ వార్తకు సంబంధించిన లింక్‌ను పోస్ట్‌ చేస్తూ.. ‘ఆ పెళ్లికి దయచేసి నన్ను కూడా ఆహ్వానించండి. ఇంతకీ పెళ్లి ఎక్కడా.? ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు.? మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం’ అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. ఏది ఏమైనా తన రెండో వివాహంపై వస్తోన్న వార్తలను మనోజ్‌ ఇలా తనదైన రీతిలో చెక్‌ పెట్టాడన్నమాట.

మనోజ్ చేసిన ట్వీట్..

Also Read: Viral Video: ఈ వీడియో చూస్తే మీ పెంపుడు కుక్కతో అస్సలు జోక్ చేయరు.. ఎందుకో తెలుసా..

Palnadu Politcs: ఎమ్మెల్యే కాసు, యరపతినేని మధ్య రాజకీయ వైరం కొత్త టర్న్‌.. పౌరుషాల గడ్డ పల్నాడులో వైసీపీ నేతల ‘గాంధీ’గిరి

T20 World Cup 2021: గుడ్ ‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. కివీస్‌తో పోరుకు ఆ బ్యాట్స్‌మెన్ సిద్ధం..!