
మీరు ఎప్పుడైనా మాధవన్‌తో ఆటోగ్రాఫ్ తీసుకున్నారా..? పోనీ ఆ హీరో ఆటోగ్రాఫ్ పెట్టిన వీడియోలు గానీ ఫొటోలు గానీ చూశారా..? ఒకవేళ చూసినట్లైతే మీరు కచ్చితంగా ఓ విషయాన్ని గుర్తించండి. అదేంటంటే.. ఆటోగ్రాఫ్ ఇచ్చే సమయంలో ఆ వ్యక్తి వైపు చూసే మాధవన్.. నవ్వుతో దాన్ని వారికి అందిస్తుంటారు. అయితే ఆయన అలా చేయడానికి ఓ కారణం ఉందంట. ఈ విషయాన్ని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు మాధవన్. ఇక దానికి సంబంధించిన వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అందరిలాగే ప్రముఖులతో ఆటోగ్రాఫ్ తీసుకోవాలని నాకు ఉండేది. ఒకసారి ఓ జాతీయ క్రికెటర్ దగ్గరకు వెళ్లాను. అప్పటికే ఓ 50 ఆటోగ్రాప్‌లు ఇచ్చిన ఆ క్రికెటర్ అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. నేను వెళ్లగానే సంతకం చేసి దాన్ని నాకు ఇచ్చారు. అయితే అప్పుడు నా వైపు కూడా చూడలేదు. అతడు చేసిందో తప్పో, ఒప్పో తెలీదు. కానీ ఆ సంఘటన వలన చాలా బాధపడ్డా. అందుకే అప్పుడే డిసైడ్ అయ్యా. ఒకవేళ భవిష్యత్‌లో నేను ఆటోగ్రాఫ్ చేయాల్సి వస్తే.. వారిని చూస్తూ చేయాలని అని చెప్పుకొచ్చారు. కాగా మాధవన్ నటించిన రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్, నిశ్శబ్దం, మారా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.