Hijab Row: తరచూ వివాదాస్పద ప్రకటనలతో ట్రెండింగ్ ఉండే సినీ నటి కంగనారనౌత్ (Kangana ranaut) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదంపై స్పందిస్తూ.. “మీరు ధైర్యం చూపించాలనుకంటే, ఆఫ్ఘనిస్తాన్ లో బురఖా ధరించకుండా చూపించండి. విముక్తి పొందడం నేర్చుకోండి, మిమ్మల్ని మీరు పంజరంలో పెట్టుకోకండి.” అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రెండు వేర్వేరు మహిళల ఫొటోలను పంచుకుంది. ఈ ఫొటోలలో ఒకటి ఈత దుస్తులలో ఉన్న మహిళలు కాగా.. మరొకటి బురఖాలలో ఉన్న మహిళలను చూపిస్తోంది. ఇరాన్ లో దాదాపు ఐదు దశాబ్దాల తేడా. యాభై ఏళ్లలో బికినీ నుంచి బుర్ఖా వరకు ఫ్లాట్. చరిత్ర నుంచి నేర్చుకోని వారు దానిని పునరావృతం చేయడం విచారకరం” అని ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. రచయిత ఆనంద్ రంగనాథన్ పోస్ట్ చేసిన ఫొటోను కంగనారనౌత్ రీ-ట్వీట్ చేసింది.
వివాదం ఏమిటి?..
కర్ణాటకలో జనవరి 1 న మొదలైన హిజాబ్ వస్త్రధారణ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఉడుపి, బెళగావి, కలబురగి సహా పలు ప్రాంతాల్లో హిజాబ్, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కొన్ని చోట్ల ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమై.. కాలేజీలు, స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
Also Read
Andhra Pradesh: విద్యార్థినులను వేధించవద్దన్నందుకు.. ప్రిన్సిపాల్‌ను వెంటపడి కొట్టిన స్టూడెంట్స్
Health News: ఈ గింజలు తింటే డయాబెటీస్ కంట్రోల్.. గుండె జబ్బుల ప్రమాదం తక్కువ..?