Nijam Movie: నిజం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో క్రేజీ హీరో.. ఎవరో గుర్తుపట్టారా.. ?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రాల్లో నిజం ఒకటి. భారీ అంచనాల మధ్య విడులైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇందులో రాశి విలన్ పాత్రలో నటించి అదరగొట్టింది. అయితే ఈ మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజ్ హీరో. అతడు నటించిన లేటేస్ట్ మూవీ ఇప్పుడు అడియన్స్ ముందుకు రాబోతుంది.

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ‘శ్రీనివాస మంగళాపురం’ చిత్రంతో వెండితెరపైకి హీరోగా అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 30న విడుదల కానుంది. ఈ చిత్రంలో రషా తడానీ నాయికగా నటించింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా విశాఖపట్నంలో జయకృష్ణ తన సినిమా ప్రయాణం, ‘శ్రీనివాస మంగళాపురం’ విశేషాలను పంచుకున్నారు. తనకు ప్రేక్షకులకు మద్దతు చాలా ముఖ్యమని జయకృష్ణ అన్నారు. ‘శ్రీనివాస మంగళాపురం’లో ఎమోషన్స్, క్యారెక్టర్స్ చాలా బాగుంటాయని, ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తన మొదటి సినిమా షూటింగ్ తొలి రోజు కొంచెం ఆందోళన పడ్డానని, ‘ఎలా చేస్తాను, షూట్ ఎలా ఉంటుందని’ అనిపించిందని తెలిపారు. అయితే, అజయ్ భూపతి ముందుగానే లుక్ టెస్ట్‌లు, స్క్రీన్ టెస్ట్‌లు చేయడంతో పాటు, తను కూడా మూడు, నాలుగు సంవత్సరాల పాటు విస్తృత శిక్షణ పొందడం వల్ల త్వరగానే అలవాటు పడి సెట్‌లో సరదాగా గడిపానని చెప్పారు. ఒక నటుడిగా అనుభవమే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సినిమాలోని ప్రతి పాత్రకు చాలా స్పష్టమైన భావోద్వేగాలు ఉంటాయని, ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో అనే గందరగోళం ఉండదని జయకృష్ణ వివరించారు. క్యారెక్టర్ ఆర్క్, ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయని, ప్రతి పాత్ర ఏం కోరుకుంటుంది, ఏం చేస్తుంది అనేది సులభంగా అర్థం చేసుకోగలరని అన్నారు. కథకు, పాత్రలకు సులభంగా కనెక్ట్ అవ్వగలరని చెప్పారు. సినిమాలో పాత్రలన్నీ వాస్తవికతకు దగ్గరగా ఉంటాయని, అజయ్ భూపతి వాస్తవిక చిత్రాలకు పేరుగాంచారని ఆయన పేర్కొన్నారు.
‘శ్రీనివాస మంగళాపురం’లోని తన పాత్ర పేరు శ్రీను అని, అతను చాలా సరదాగా ఉండే వ్యక్తి అని, కొంచెం అల్లరివాడని జయకృష్ణ అన్నారు. కానీ తన లక్ష్యం పట్ల చాలా పట్టుదల కలిగిన వాడని, అది సాధించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడని వివరించారు. ఈ పాత్ర చాలా ముద్దుగా ఉంటుందని, ప్రేక్షకులు శ్రీను పాత్రను ఇష్టపడతారని, నాయిక పాత్రను కూడా అభిమానిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కథ, పాత్రలు, వాటి మధ్య కెమిస్ట్రీని ప్రేక్షకులు నిజంగా ఆస్వాదిస్తారని ఆయన చెప్పారు.
మహేశ్ బాబు గురించి మాట్లాడుతూ, ఈ కథను అజయ్ భూపతి తనకు చెప్పినప్పుడు చాలా నచ్చిందని, చేయాలనిపించిందని జయకృష్ణ తెలిపారు. కిరణ్ ద్వారా అజయ్ ని కలిశానని, తాతయ్య దత్ కూడా తనతో వచ్చారని చెప్పారు. టీజర్‌లు, సాంగ్స్ వచ్చిన తర్వాత మహేశ్ బాబుకి (బావయ్య) చూపించామని, ఆయనకు చాలా నచ్చిందని వెల్లడించారు. అప్పటి నుంచి ఆయన తమకు నిరంతరం సలహాలు ఇస్తూనే ఉన్నారని కృతజ్ఞతలు తెలిపారు. చిన్నతనంలో తన బాబాయితో కలిసి ‘నిజం’ చిత్రంలో నటించానని, అప్పుడు తను కేవలం మూడేళ్ల పసిపిల్లవాడిని కావడంతో పెద్దగా గుర్తులేదని జయకృష్ణ గుర్తు చేసుకున్నారు. 17, 18 ఏళ్ల వయసులో నటుడిగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత, నటనతో పాటు డాన్స్, ఫైట్‌లలో కూడా పూర్తి స్థాయిలో శిక్షణ పొందానని చెప్పారు. ముఖ్యంగా యాక్షన్‌ను తను చాలా ఎంజాయ్ చేస్తానని, దానికోసం చాలా శిక్షణ తీసుకున్నానని వివరించారు. విశాఖపట్నం చాలా అందమైన నగరమని, హైదరాబాద్‌లో బీచ్‌లు లేకపోవడం వల్ల వైజాగ్ వచ్చినప్పుడు ఒక కొత్త అనుభూతి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
జయకృష్ణ ఫోటో..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
