AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ సినిమాలో చిరంజీవి హీరో.. కానీ నాతోనే ఐదు పాటలు చేయించారు.. 40 సీన్స్ ఇచ్చారు.. గొల్లపూడి కామెంట్స్..

లెజెండరీ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు తన సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక సినిమాలో హీరో చిరంజీవి అని.. ఆయన తనకు 40 సీన్స్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అలాగే తన క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ గురించి చెప్పుకొచ్చారు.

Tollywood : ఆ సినిమాలో చిరంజీవి హీరో.. కానీ నాతోనే ఐదు పాటలు చేయించారు.. 40 సీన్స్ ఇచ్చారు.. గొల్లపూడి కామెంట్స్..
Actor Gollapudi Maruthi Rao
Rajitha Chanti
|

Updated on: May 08, 2026 | 9:33 AM

Share

సాధారణంగా విలన్ అంటే పెద్ద శరీరం, గంభీరమైన గొంతు ఉండాలనే అప్పటి సంప్రదాయాన్ని గొల్లపూడి మారుతీరావు చెరిపివేశారు. తనకున్న పరిమితులను గమనించి, ఒక విలన్ లోకల్ మనిషిలా, పక్కింటి వ్యక్తిలా ఉంటూనే ఎంతటి దారుణాలకు ఒడిగట్టవచ్చో తన పాత్రల ద్వారా చూపించారు. ముఖం మీద నవ్వు పులుముకుని, ఎదుటివారి భుజంపై చేయి వేసి ఆత్మీయంగా మాట్లాడుతూనే వెన్నుపోటు పొడిచే ‘సాఫ్ట్ విలనిజం’ వంటి పాత్రలను వెండితెరపై ఆవిష్కరించారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా టైటిల్ వినగానే అప్పట్లో అందరూ ఇది చిరంజీవి పాత్ర గురించని అనుకున్నారు. కానీ నిజానికి ఆ టైటిల్ రోల్ పోషించింది తానే అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

మొదటి సినిమాలోనే సుమారు 40 సీన్లు ఉండటం, అందులోనూ టైటిల్ రోల్ దక్కడం ఒక విశేషం. ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి, మాధవి, తనని కలిపి స్టిల్స్ తీసినప్పుడు తాను ఎంతో ఆశ్చర్యపోయానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో తనతో ఐదు పాటలు పాడించారని అన్నారు. మొదట్లో ఈ సినిమాను తాను చేయనని అన్నానని.. ఆ తర్వాత ఒప్పుకున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఎంతో హార్డ్ వర్కింగ్ అని, తన పని పట్ల ఆయనకున్న అంకితభావం అమోఘమని గొల్లపూడి ప్రశంసించారు. ఆ రోజుల్లోనే చిరంజీవి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారని పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో చిరంజీవి తనకు ఎంతో సహకరించేవారని, వారిద్దరూ మంచి మిత్రులుగా ఉండేవారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

తాను రచయితగా ఉన్నప్పుడు ఎప్పుడూ నటుడు కావాలని కోరుకోలేదని, ఆ అవకాశం అనుకోకుండానే వచ్చిందని గొల్లపూడి చెప్పారు. అయితే స్టేజ్ మీద నటించిన అనుభవం ఉండటం వల్ల కెమెరా ముందుకు వెళ్లినప్పుడు పెద్దగా ఇబ్బంది కలగలేదని వివరించారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా 515 రోజులు ఆడి ఘనవిజయం సాధించడం తన జీవితంలో ఒక మరుపురాని ఘట్టమని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

Follow Us
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ