AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘విలువైన పాఠాలను నేర్చుకున్నాను’.. అల్లు అర్జున్‌ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

బన్నీ కెరీర్‌లో 2023 ఏడాది ది బెస్ట్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాదే అల్లు అర్జున్‌ పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు హీరోగా బన్నీ అరుదైన ఘనత సాధించారు. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న..

Allu Arjun: 'విలువైన పాఠాలను నేర్చుకున్నాను'.. అల్లు అర్జున్‌ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
Allu Arjun
Narender Vaitla
|

Updated on: Jan 01, 2024 | 11:08 AM

Share

కొత్తేడాదికి ప్రజలంతా స్వాగతం పలికారు. కోటి ఆశలతో కొత్తేడాదిలోకి అడుగుపెట్టారు. ఇక గడిచిన కాలాన్ని సైతం నెమరువేసుకుంటూ, కొత్తేడాది జీవితం ఎలా ఉండాలో ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు.. గతేడాది తాము ఎదుర్కొన్న అనుభవాలు, నేర్చుకున్న విషయాలను ప్రాస్తవిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం నెట్టింట ఇలాంటి పోస్ట్‌లు చేస్తున్నారు.

తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సైతం ఇలాంటి ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. 2023లో తాను ఎదుర్కొన్న అనుభవాలు, నేర్చుకున్న విషయాలను వివరిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్ చేశారు. ఇంతకీ బన్నీ చేసిన పోస్ట్‌లో ఏముందంటే.. ‘2023లో నా అద్భుత ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 2023 నాకు అన్ని విధాలుగా ఒక అద్భుమైన ఏడాది. ఈ సంవత్సరంలో నేను చాలా అందమైన, ముఖ్యమైన, విలువైన పాఠాలను నేర్చుకున్నాను. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. అందమైన ఈ 2023 సంవత్సరానికి ఎంతో కృతజ్ఞతతో వీడ్కోలు పలుకుతున్నాను. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూఇయర్ 2024’ అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నిజానికి బన్నీ కెరీర్‌లో 2023 ఏడాది ది బెస్ట్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాదే అల్లు అర్జున్‌ పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు హీరోగా బన్నీ అరుదైన ఘనత సాధించారు. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఏకైన హీరోగా బన్నీ నిలిచారు. ఇక 2024 కూడా బన్నీకి కీలక ఏడాదిగా చెప్పొచ్చు. పుష్ప సీక్వెల్‌ను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అల్లు అర్జున్ ట్వీట్..

పుష్ప చిత్రంతో నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న బన్నీ కెరీర్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగింది. బన్నీ మార్క్‌ మేనరిజం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. దీంతో బన్నీకి నార్త్ ఆడియన్స్‌ సైతం అభిమానులుగా మారిపోయారు. దీంతో ప్రస్తుతం రానున్న పుష్ప2 చిత్రంపై అందరి దృష్టి పడింది. తొలి పార్ట్ అనూహ్య విజయాన్ని సాధించిన నేపథ్యంలో సుకుమార్‌ పార్ట్‌ 2పై మరింత దృష్టిసారించారు. మరి పుష్ప 2 చిత్రం బన్నీ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..