సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది.. పోలీసులు అల్లు అర్జున్ ను మూడున్నర గంటల పాటు విచారణ జరిపారు.. ఇవాళ అడ్వొకేట్ అశోక్ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు.. అనంతరం స్టేషన్ లో పోలీసులు అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ ను రికార్డు చేశారు.. స్టేట్మెంట్ రికార్డు తర్వాత అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు.. దాదాపు 20 ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు అడిగారు.. కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగానే ఉండిపోయారు.. విచారణ సమయంలో అల్లు అర్జున్‌కి పోలీసులు తొక్కిసలాట వీడియో చూపించినట్టు తెలుస్తోంది.. 4వతేదీన సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటతోపాటు.. శనివారం ప్రెస్‌మీట్‌లో బన్నీ మాట్లాడిన అంశాలపైనా ప్రశ్నలు సంధించారు.. పలు ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇచ్చారు.. కొన్ని ప్రశ్నలకు మాత్రం అల్లు అర్జున్ మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం..
అల్లు అర్జున్ విచారణ అనంతరం.. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు వెల్లడించారు.. దీనిపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పోలీస్ విచారణకు సహకరిస్తానని తెలిపారు. కాగా, స్టేట్‌మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు.. మరోసారి విచారణకు పిలుస్తారా లేదా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది..
డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప2 ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య ధియేటర్‌కి వెళ్లినప్పుడు అక్కడ తోపులాట జరిగింది.. లోయర్ బాల్కనీలో గేట్ తీసినప్పుడు అక్కడ జరిగిన తోపులాటలో రేవతి చనిపోయింది. ఆతర్వాత అమెను అక్కడి నుంచి ధియేటర్ బయటకు తీసుకొచ్చారు. రేవతితోపాటు ఆమె కొడుకు శ్రీతేజ కూడా అప్పుడు ఆపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ తొక్కిసలాట విషాదంలో రేవతి చనిపోగా.. శ్రీతేజ ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఈ నేపథ్యంలోనే ఈతొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులపై అల్లు అర్జున్‌ని పోలీసులు ప్రశ్నించారు. రోడ్‌షో లేదా ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదని అయినా థియేటర్‌కు ఎందుకు వచ్చారని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.. మూడున్నర గంటల పాటు కొనసాగిన విచారణలో పలు కీలక అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.