Acharya Song: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. 2019లో వచ్చిన ‘సైరా నర్సింహా రెడ్డి’ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించని చిరు.. ఆచార్యతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తుండడం, అపజయం అంటూ ఎరగని కొరటాల దర్శకత్వం వహిస్తుండడంతో ‘ఆచార్య’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, పాటలు ఈ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇక తన సినిమాలో కచ్చితంగా స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేసుకునే కొరటాల ‘ఆచార్య’లోనూ ఉషారు పెంచే ఓ స్పెషల్ సాంగ్‌ను కంపోజ్ చేయించారు. రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అనే పాట టీజర్‌ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.
ముందుగానే ప్రకటించినట్లు మేకర్స్ తాజాగా ఈ పాట ఫుల్ లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేశారు. ‘కల్లోలం.. కల్లోలం.. అల్ల కల్లోలం’ అనే లిరిక్స్‌తో మొదలయ్యే ఈ పాట చిరు అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ ముఖ్యంగా చిరంజీవి ఈ పాటకు వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డ్యాన్స్‌లకు పెట్టింది పేరైనా చిరు.. ఎన్నేళ్లు అయినా తనలోని స్టామినా ఏ మాత్రం తగ్గలేదన్నట్లు స్టెప్స్‌తో రచ్చ రచ్చ చేశారు. రెజీనాతో పోటీపడీ మరీ కాలు కదిపారు. దీంతో ఈ పాట విడుదల చేసిన కొత్త క్షణాల్లోనే రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటను భాస్కరభట్ల రచించగా.. రేవంత్, గీతా మాధురి పాడారు. ఇక సంగీతం దిగ్గజం మణిశర్మ అందించిన ట్యూన్స్ ఈ పాటకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. మరి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ సాంగ్ లిరికల్ వీడియోను మీరూ ఓసారి వినేయండి.
ఇక ఆచార్యం చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Also Read: YS Sharmila: అక్కడ పార్టీ పెట్టకూడదా.. మీడియాతో షర్మిల సంచలన కామెంట్స్..