Varun Tej: హాలీవుడ్ హీరోను తలదన్నే ఫిజిక్ మెగా హీరో వరుణ్ తేజ్ సొంతం. అయితే వరుణ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో అతని ఫిజిక్, హైట్ తగ్గట్లున్న పాత్రలు కొన్నేనని చెప్పాలి కంచెలో సైనికుడిగా, గణిలో బాక్సింగ్ ప్లేయర్‌గా తప్ప మిగతా సినిమాల్లో లవర్ బాయ్, మాస్ హీరో రోల్స్‌లోనే నటించాడు. ఇక ఎఫ్2, ఎఫ్3తో తనలోని కామెడీని టైమింగ్‌ను సైతం ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అయితే తాజాగా వరుణ్ తన బాడీ లాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే పాత్రలో కనిపించనున్నాడు వరుణ్ తేజ్.
ఎఫ్2 సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుంది. షూటింగ్ మెజారిటీ శాతం లండన్‌లోనే జరగనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ మాత్రం రాలేదని చెప్పాలి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వరుణ్ తేజ్ అంతర్జాతీయ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
కెరీర్‌లో తొలిసారి గూఢచారి పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతోన్న వరుణ్ అందుకు తగ్గట్లుగా తన లుక్‌ను మార్చుకునే పనిలో పడ్డట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గరుడ వేగ’ కూడా ఇలాంటి కథాంశంతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో వరుణ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..