Vijay Devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడన్న కథాంశంతో వస్తోన్న ఈ సినిమాపై యావత్ ఇండియన్ సినిమా దృష్టి పడింది. హీరోలకు సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసే డైరెక్టర్, ఇప్పటికే తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరో కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో అని అంతా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే తనతో సినిమాలు చేసిన హీరోలను ఇట్టే స్నేహితులుగా మార్చేసుకుంటారు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇప్పటి వరకు ఆయనతో పనిచేసిన హీరోలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విజయ్‌తో కూడా పూరీకి అలాంటి స్నేహమే ఏర్పడింది. లైగర్ చిత్రం ఏకంగా రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంటుండడంతో ఛార్మి, పూరీ జగన్నాథ్, విజయ్ మంచి స్నేహితులిగా మారారు. ఈ నేపథ్యంలోనే విజయ్‌ని మరోసారి డైరెక్ట్ చేయాలని పూరీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ.. లైగర్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే విజయ్, పూరీ కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూరీ ఇప్పటికే ఇందుకోసం మంచి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఉందా.? లేదా గాసిప్ రాయుళ్లు పుట్టించిన పుకారేనా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: YS Sharmila: అక్కడ పార్టీ పెట్టకూడదా.. మీడియాతో షర్మిల సంచలన కామెంట్స్..
Viral Video: మద్యం తాగిన కోతి.. ఫుల్‌గా కిక్కెక్కి ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు.. వైరల్ వీడియో!
Covid-19 Omicron: ఒమిక్రాన్ చాటున కరోనా విజృంభణ.. లైవ్ వీడియో