Vijay Sethupathi: వారెవ్వా ఏం క్రేజ్‌ స్వామీ.. విలన్‌ పాత్ర కోసం విజయ్‌ సేతుపతి అన్ని రూ. కోట్లు తీసుకుంటున్నాడా.?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఈ పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్‌ దేశవ్యాప్తంగా ఎంతో మంది...

Vijay Sethupathi: వారెవ్వా ఏం క్రేజ్‌ స్వామీ.. విలన్‌ పాత్ర కోసం విజయ్‌ సేతుపతి అన్ని రూ. కోట్లు తీసుకుంటున్నాడా.?
Vijay Sethupathi

Updated on: Aug 29, 2022 | 8:45 AM

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఈ పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్‌ దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో తనదైన ముద్ర వేశాడు విజయ్‌. హీరోగా రాణిస్తూనే సమయంలోనే విలన్‌ పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిన విక్రమ్‌ చిత్రంలో విలన్‌గా నటించి ఔరా అనిపించారు. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇదిలా ఉంటే విజయ్‌ తాజాగా మరోసారి విలన్‌ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తమిళ్‌ డైరకెక్టర్‌ అట్లి దర్శకత్వంలో షారుఖ్‌ హీరోగా తెరకెక్కుతోన్న జవాన్‌లో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించనున్నట్లు విధితమే. అయితే తాజాగా దీనికి సంబంధించి మరో అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాలో విజయ్‌ ఏకంగా రూ. 21 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడనేది సదరు అప్‌డేట్ సారంశం. ఇప్పటి వరకు రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్న విజయ్‌ ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్‌ పెంచేశాడనే చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే జవాన్‌ సినిమాలో నయనతా హీరోయిన్‌గా నటిస్తుండగా, దీపికా పదుకొణె గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.