Samantha: పుష్పలో స్పెషల్ సాంగ్‌లో కనిపించి ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార సమంత. అప్పటి వరకు ఆచి తూచి సినిమాలు చేస్తూ వచ్చిన సామ్ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టిన తర్వాత వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక ఓ వైపు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వార్తల్లో నిలిచిన సామ్, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
అయితే గత కొన్ని రోజులుగా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం లేదు. తన వ్యక్తిగత, ప్రొఫెషెనల్ విషయాలను పంచుకునే సామ్ ఒక్కసారిగా సైలెంట్ అయి పోయింది. దీంతో సమంత ఎందుకు ఇలా మారిందని పెద్ద చర్చ జరిగింది. అయితే సమంత ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం శిక్షణలో ఉన్న కారణంగానే సోషల్ మీడియాకు దూరంగా ఉందని తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించిన సామ్ ఇప్పుడు అదే టీమ్ తెరకెక్కిస్తోన్న మరో వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ కోసమే సమంత కసరత్తులు చేస్తోందని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ బిజీబిజీగా గడుపుతున్న కారణంగానే సామాజిక మాధ్యమాల్లో గతంలో ఉన్నంతగా యాక్టివ్‌గా ఉండడం లేదని బీటౌన్ వర్గాలు అంటున్నాయి. మరి ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున వస్తోన్న ప్రశ్నలకు సామ్ స్వయంగా సమాధానం చెప్తుందో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం తెలుగులో యశోద, శాకుంతలం, విజయ్‌దేవరకొండతో ఖుషీతో పాటు బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. వీటితో పాటు మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాలని చూస్తోన్న సమంత ఓ హాలీవుడ్ చిత్రానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విధితమే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..