RC 15: రామ్‌ చరణ్‌ – శంకర్‌ల చిత్రానికి ఆసక్తికర టైటిల్‌.. చెర్రీ బర్త్‌డే రోజున అధికారిక ప్రకటన.?

|

Mar 10, 2022 | 5:53 PM

RC 15: రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shanker) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రస్తుతం ఆర్‌సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న..

RC 15: రామ్‌ చరణ్‌ - శంకర్‌ల చిత్రానికి ఆసక్తికర టైటిల్‌.. చెర్రీ బర్త్‌డే రోజున అధికారిక ప్రకటన.?
Rc 15 Title
Follow us on

RC 15: రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shanker) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రస్తుతం ఆర్‌సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌లో ఇది 50వ చిత్రం కావడం మరో విశేషం. ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోని ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ప్రస్తుతం రాజమంత్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చెర్రీకి జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులు అవుతోన్న ఇప్పటికీ సినిమా టైటిల్‌ను ప్రకటించకపోవడం గమనార్హం. దీంతో అభిమానుల్లో ఈ సినిమా టైటిల్‌ ఏంటన్న దానిపై ఆసక్తినెలకొంది. రామ్‌చరణ్‌ ఈ సినిమాలో ఎలక్షన్‌ కమీషనర్‌గా కనిపించనున్నాడన్న వార్తలు వచ్చిన క్రమంలో, ఈ చిత్రం రాజకీయాంశాల చుట్టూ ఉంటుందనే చర్చ జరిగింది. యస్‌జె సూర్య ముఖ్యమంత్రిగా నటించనున్నారని, రాజకీయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య జరిగే సంగ్రామమే ఈ సినిమా కథాంశమని వార్తలు వచ్చాయి.

ఈ సినిమాకు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. మార్చి 27న రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ‘సర్కారోడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మార్చి 27వ వరకు వేచి చూడాల్సిందే.

Also Read: MLA Raja Singh: టీఆర్ఎస్, ఎంఐఎంలను బుల్డోజర్లతో తొక్కిస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఎంపీ కుమారుడు దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు..

Women’s Day 2022: ఉద్యోగాల్లో లింగ అసమానత.. మెటర్నిటీ లీవ్‌ తర్వాత మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు!