Ram Charan: స్పీడ్ పెంచిన మెగా ప‌వ‌ర్ స్టార్‌.. మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన చెర్రీ.?

Ram Charan: రెండేళ్ల క్రితం వ‌చ్చిన విన‌య విధేయ వ‌ర్మ త‌ర్వాత మ‌ళ్లీ వెండి తెర‌పై క‌నిపించలేదు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ ఛ‌రణ్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాకు...

Ram Charan: స్పీడ్ పెంచిన మెగా ప‌వ‌ర్ స్టార్‌.. మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన చెర్రీ.?

Edited By: Ram Naramaneni

Updated on: Jan 11, 2022 | 10:18 AM

Ram Charan: రెండేళ్ల క్రితం వ‌చ్చిన విన‌య విధేయ వ‌ర్మ త‌ర్వాత మ‌ళ్లీ వెండి తెర‌పై క‌నిపించలేదు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ ఛ‌రణ్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాకు భారీగా డేట్స్ ఇవ్వ‌డంతో చ‌ర్రీ మ‌రో సినిమా చేయ‌లేక‌పోయాడు. దీంతో ఆయ‌న అభిమానులు నిరాశ‌కు గుర‌య్యారు. అయితే అభిమానుల నిరాశ‌కు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన చెర్రీ.. ప్ర‌స్తుతం సినిమాల్లో వేగాన్ని పెంచే ప‌నిలో ప‌డ్డారు. రెండేళ్లు వ‌చ్చిన గ్యాప్‌ను క‌వ‌ర్ చేసేందుకు వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు.

ఇప్ప‌టికే శ‌కంర్ చిత్రంలో ఓ సినిమా చేస్తున్న రామ్ చ‌ర‌ణ్‌, ఈ సినిమా ఇంకా పూర్తికాక‌ముందే గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. గౌత‌మ్ నాని హీరోగా వ‌చ్చిన జెర్సీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొద‌లు కూడా కాక‌ముందే చెర్రీ మరో సినిమాను లైన్‌లో పెట్టే ప‌నిలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

తాజాగా శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంతో అట్రాక్ట్ చేసిన యంగ్ ద‌ర్శ‌కుడు రాహుల్ సాంక్రిట్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రామ్ చ‌ర‌ణ్ ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రాహుల్ చెప్పిన క‌థ లైన్ న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌టన వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: మత్సకారుడి పంట పండింది !! వలకు చిక్కిన భారీ ఫిష్‌ ఎంత ధర పలికిందంటే ?? వీడియో

Rowdy Boys: రౌడీ బాయ్స్ కోసం రంగంలోకి ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ చేతులమీదుగా డేట్ నైట్ సాంగ్

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..! వచ్చే నెల నుంచి వీరు అధికంగా చెల్లించాల్సిందే..?