Rajamouli: మరోసారి ఆ హీరోయిన్‌కే మొగ్గు చూపుతోన్న జక్కన్న.. మహేష్‌ సినిమాలో క్యూట్‌ గర్ల్‌..

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు...

Rajamouli: మరోసారి ఆ హీరోయిన్‌కే మొగ్గు చూపుతోన్న జక్కన్న.. మహేష్‌ సినిమాలో క్యూట్‌ గర్ల్‌..
Rajamouli
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 16, 2022 | 8:20 PM

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రిపులార్‌ చిత్రంతో మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన జక్కన్న.. మహేష్‌తో మరో వండర్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా పూర్తికాగానే రాజమౌళి చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ట్రిపులార్‌ సినిమాలో సీత పాత్రలో నటించిన అలియాను జక్కన్న మరోసారి రిపీట్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌ ఉమేర్‌ సంధు చేసిన ఈ ట్వీట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రిపులార్‌ సినిమాలో అలియా పాత్ర నిడివి తక్కువగా ఉండడం తనను నిరాశపరిచిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మహేష్‌ సినిమాలో అలియాను తీసుకుంటున్నారన్న చర్చ తెరపైకి వచ్చింది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Alia Bhatt

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే