Priya Prakash: నక్కతోక తొక్కిన వింకిల్‌ గర్ల్‌.. మెగా మల్టీస్టారర్‌ మూవీలో ఛాన్స్‌ కొట్టేసిన ప్రియా.?

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక చిన్న వీడియతో నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీ దక్కించుకుందీ చిన్నది. కన్ను గీటిన వీడియోతో కుర్రకారు గుండెల్లో రైళ్‌లు పరిగెత్తేలా చేసింది. ఈ పాపులారిటీ అయితే ప్రియాకు అవకాశాలు తెచ్చి..

Priya Prakash: నక్కతోక తొక్కిన వింకిల్‌ గర్ల్‌.. మెగా మల్టీస్టారర్‌ మూవీలో ఛాన్స్‌ కొట్టేసిన ప్రియా.?
Priya Prakash

Updated on: Feb 23, 2023 | 11:16 AM

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక చిన్న వీడియతో నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీ దక్కించుకుందీ చిన్నది. కన్ను గీటిన వీడియోతో కుర్రకారు గుండెల్లో రైళ్‌లు పరిగెత్తేలా చేసింది. ఈ పాపులారిటీ అయితే ప్రియాకు అవకాశాలు తెచ్చి పెట్టాయి కానీ ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేక పోయిందీ బ్యూటీ. తెలుగుతో పాటు హిందీలోనూ వరుస ఆఫర్లను వచ్చినా విజయాన్ని మాత్రం ఖాతాలో వేసుకోలేకపోయింది.

అయితే సినిమాలతో పెద్దగా బిజీగా లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం నిత్య యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. హాట్‌ హాట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ చూపు తిప్పుకోకుండా మెస్మరైజ్ చేస్తోంది. దీంతో ప్రియాకు సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా క్రేజ్‌ పెరిగిపోయింది. ఈ బ్యూటీని ఏకంగా 74 లక్షల మంది ఫాలో అవుతుండడం విశేషం. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సరైన హిట్‌ లేక ఇబ్బందిపడుతోన్న ప్రియాకు సాలిడ్‌ హిట్ పడే ఛాన్స్‌ దక్కినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇంతకీ విషయమేంటంటే.. పవన్‌ కళ్యాణ్‌, సాయి తేజ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మెగా మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఇప్పటికే కేతిక శర్మను చిత్ర యూనిట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రెండో హీరోయిన్‌గా ప్రియాను చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒక వేళ ఈ వార్తే కనుక నిజమైతే ప్రియాకు సాలిడ్‌ హిట్‌ పడుతుందడనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..