ట్రిపులార్ లాంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన కసరత్తులు తాజాగా మొదలయ్యాయి. మాస్ యాక్షన్‌గా రానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఒక పోస్టర్ తప్ప ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో తారక్ ఫ్యాన్స్ వేయి కళ్లతో సినిమా అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం మిస్టరీగా మారింది. ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలనాటి అందాల తార జాహ్నవి కపూర్ ఈ సినిమాలో నటించనుందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధాకారిక ప్రకటన రాలేదు. అనంతరం మృణాల్ ఠాకూర్ ఎన్టీఆర్‌కు జోడిగా నటించనుందని వార్తలు వచ్చాయి.. అయితే దీనిపై కూడా చిత్ర యూనిట్ స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా హీరోయిన్‌కు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ట్రెండ్ అవుతోన్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. వీరిలో ఒకరు రష్మిక కాగా, మరొకరు కీర్తీ సురేషన్ అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఇప్పటి వరకు వీరిద్దరితో నటించలేదనే విషయం తెలిసిందే. మరి తాజాగా వైరల్ అవుతోన్న ఈ వార్తలో అయినా నిజం ఉందా.. లేదా ఇది కూడా పుకారు వార్తేనా అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఎన్‌టీఆర్ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..