DJ Tillu 2: డీజే టిల్లు సీక్వెల్‌ నుంచి తప్పుకున్న అనుపమ.? రంగంలోకి మరో ప్రేమమ్‌ బ్యూటీ..

|

Nov 29, 2022 | 8:26 AM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన 'డీజే టిల్లు' ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో సిద్ధు ఒక్కసారిగా స్టార్‌ హీరోగా ఎదిగాడు...

DJ Tillu 2: డీజే టిల్లు సీక్వెల్‌ నుంచి తప్పుకున్న అనుపమ.? రంగంలోకి మరో ప్రేమమ్‌ బ్యూటీ..
Dj Tillu 2
Follow us on

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘డీజే టిల్లు‘ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో సిద్ధు ఒక్కసారిగా స్టార్‌ హీరోగా ఎదిగాడు. యూత్‌ను కనెక్ట్‌ అయ్యే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. డీజే టిల్లుకు కథ అందించింది సిద్ధునే కావడం విశేషం. ఈ సినిమా ఊహించని విజయాన్ని నమోదు చేయడంతో మేకర్స్‌ ఈ చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ‘టిల్లు స్క్వేర్‌’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఈ సీక్వెల్ చిత్రంలో అనుపమను హీరోయిన్‌ తీసుకోనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ అనుపమ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకుగల కారణం ఏంటన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. దీంతో అనుపమ ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను తీసుకునేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

రాధిక పాత్రలో ప్రేమమ్‌ చిత్రంలో నటించిన మరో బ్యూటీ మడోన్నా సెబాస్టియన్‌ను తీసుకునే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. చిత్ర యూనిట్ ఇప్పటికే హీరోయిన్‌ను సంప్రదించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనుపమ కూడా ప్రేమమ్‌ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే డీజే టిల్లు సీక్వెల్‌లో మొదట శ్రీలీలాను తీసుకోవాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. అయితే డేట్స్‌ అడ్జెస్ట్‌ కాకపోవడంతో ఈ అమ్మడు సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..