Vijay Devarakonda: అప్పుడే ఊపందుకున్న విజయ్‌, పూరీ నెక్ట్స్‌ మూవీ వార్తలు.. ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అతడేనంటూ..

|

Feb 01, 2022 | 4:59 PM

Vijay Devarakonda: టాలీవుడ్‌లో సెన్సేషన్‌లా దూసుకొచ్చాడు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. అత్యంత తక్కువ సమయంలో టాప్‌ హీరోలతో సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడీ ట్యాలెంట్‌డ్‌ యాక్టర్‌. అర్జున్‌ రెడ్డితో తొలిసారి నేషనల్ ఆడియన్స్‌ సైతం తనవైపు తిప్పుకున్న విజయ్‌ తొలిసారి..

Vijay Devarakonda: అప్పుడే ఊపందుకున్న విజయ్‌, పూరీ నెక్ట్స్‌ మూవీ వార్తలు.. ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అతడేనంటూ..
Follow us on

Vijay Devarakonda: టాలీవుడ్‌లో సెన్సేషన్‌లా దూసుకొచ్చాడు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. అత్యంత తక్కువ సమయంలో టాప్‌ హీరోలతో సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడీ ట్యాలెంట్‌డ్‌ యాక్టర్‌. అర్జున్‌ రెడ్డితో తొలిసారి నేషనల్ ఆడియన్స్‌ సైతం తనవైపు తిప్పుకున్న విజయ్‌ తొలిసారి లైగర్‌తో పాన్‌ ఇండియా సినిమాతో నేషనల్ మార్కెట్‌పై కన్నేశాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల్వకముందే పూరి, విజయ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

లైగర్‌ సినిమా పూర్తికాగానే వీరిద్దరి మరో ప్రాజెక్ట్‌ మొదలు పెట్టనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక పూరీ జగన్నాథ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన జనగణమన సినిమానే ఇదేనంటూ కూడా టాలీవుడ్‌ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే మరో కొత్త వార్త నెట్టింట సందడి చేస్తోంది.

 

అదే పూరీ, విజయ్‌ కాంబినేషన్‌లో రానున్న కొత్త సినిమా సంగీత దర్శకుడు. ఈ సినిమాకు అస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడనేది సదరు వార్త సారంశం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో ఈ సినిమాలో విజయ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ, దివంగత నటి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్‌ నటించనున్నట్లు కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: Bangarraju: నాగ్, చైతూల మూవీ బ్రేక్ ఈవెన్ అందుకుందా..? 18 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

Viral Video: 10 అడుగుల బాహుబలి దోశను తినండి.. ప్రైజ్ మనీ గెలవండి.. ఎంతో తెలుసా?

Budget 2022: త్వరలో అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్‌లు.. ఇవి మరింత భద్రంగా ఉంటాయటా..