AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian 2 Accident:’ఇండియన్ 2′ ప్రమాదం.. అక్కడ షూటింగ్ చేస్తే ప్రమాదాలు తప్పవా..!

లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదం వార్త దక్షిణాది ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో చిత్రయూనిట్‌కు చెందిన ముగ్గురు మృతి చెందగా.. దాదాపు పది మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రధాన తారాగమమైన కమల్

Indian 2 Accident:'ఇండియన్ 2' ప్రమాదం.. అక్కడ షూటింగ్ చేస్తే ప్రమాదాలు తప్పవా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 25, 2020 | 4:56 PM

Share

లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదం వార్త దక్షిణాది ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో చిత్రయూనిట్‌కు చెందిన ముగ్గురు మృతి చెందగా.. దాదాపు పది మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రధాన తారాగమమైన కమల్ హాసన్, కాజల్.. ఘటన జరిగిన కొన్ని నిమిషాల ముందు అక్కడి నుంచి వెళ్లిపోగా.. వెంట్రుకవాసిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై కోలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు స్పందించి.. తమ సానుభూతిని ప్రకటించారు.

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కమల్ హాసన్.. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తానని ప్రకటించారు. అయితే మూవీ షూటింగ్‌లలో ఇలాంటి ప్రమాదాలు జరగడం కొత్తేం కాదు. కానీ ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ మూవీ షూటింగ్‌ చెన్నైలోని ఓ ప్రముఖ ఫిలిం సిటీలో జరిగింది. అక్కడ గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి. రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ అక్కడే జరగగా.. ఆ సమయంలో విద్యుత్ షాక్ కొట్టి మైఖేష్ అనే ఓ టెక్నీషియన్ మృతి చెందారు. ఇక విజయ్ నటించిన బిగిల్ మూవీ షూటింగ్ కూడా కొంత భాగం అక్కడే జరగ్గా.. 100 అడుగుల క్రేన్ నుంచి ఫోకస్ లైట్ పడటంతో సెల్వరాజ్ అనే ఓ ఎలక్ట్రీషియన్ అక్కడికక్కడే మరణించారు. అంతేకాదు తమిళ బిగ్‌బాస్ రెండో సీజన్ షూటింగ్ కూడా అక్కడే జరిగింది. ఆ సమయంలో ఏసీ మెకానిక్ కన్నుమూశారు. ఇలా వరుసగా ఆ ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతుండటం.. కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Read This Story Also:క్రేన్ ప్రమాదంపై స్పందించిన కమల్..

Follow Us
గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్రం మరో కఠిన రూల్..
గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్రం మరో కఠిన రూల్..
యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం..
యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం..
తమిళ్ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
తమిళ్ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
90 ఏళ్లలో కూడా డ్యాన్స్.. ఎనర్జీ మాత్రం సూపర్.. సీక్రెట్ ఇదే
90 ఏళ్లలో కూడా డ్యాన్స్.. ఎనర్జీ మాత్రం సూపర్.. సీక్రెట్ ఇదే
పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..?
పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..?
పూరి జగన్నాథ్ కూతురిని చూశారా.. ? లేటేస్ట్ లుక్స్ వైరల్..
పూరి జగన్నాథ్ కూతురిని చూశారా.. ? లేటేస్ట్ లుక్స్ వైరల్..
బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే
బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే
రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు అలర్ట్..
రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు అలర్ట్..
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్