
ఇటీవల ఎప్పుడూ లేనంత ఫిట్‌గా, యంగ్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అయితే ఈసారి ఆయన ఈ ఫిట్‌నెస్ కోసం గంటల తరబడి జిమ్‌లో చెమట చిందించలేదట. కఠినమైన వర్కౌట్లు చేయకుండానే కేవలం ఒక చిన్న మార్పుతో కిలోల కొద్దీ బరువు తగ్గానని చెప్పి అందరికీ షాకిచ్చారు. అసలు వ్యాయామం చేయకుండానే బరువు తగ్గడం సాధ్యమేనా? ఈ స్టార్ హీరో ఫాలో అయిన ఆ సీక్రెట్ డైట్ ఏంటి?
అమీర్ ఖాన్ బరువు తగ్గాలనే లక్ష్యంతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టలేదు. నిజానికి ఆయనను చాలా కాలంగా వేధిస్తున్న మైగ్రేన్ (తీవ్రమైన తలనొప్పి) సమస్యకు పరిష్కారం కోసం ఆహారంలో మార్పులు చేసుకున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, అనూహ్యంగా ఆయనను ఫిట్‌గా మార్చేసింది. “నేను బరువు తగ్గడానికి ఎలాంటి ప్రత్యేక ప్రయత్నం చేయలేదు. నా ఆహారపు అలవాట్లను మార్చుకున్నాను, అది నాకు అద్భుతంగా పనిచేసింది. నాలో వచ్చిన ఈ మార్పు నాకే ఆశ్చర్యం కలిగించింది” అని అమీర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
శరీరంలోని అంతర్గత కొవ్వును తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడాన్నే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని పిలుస్తారు. ఈ డైట్ వల్ల శరీరంలో జీవక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా అనవసరమైన కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఈ డైట్ లో ఉండే ప్రధాన ఆహారాలు పండ్లు, కూరగాయలు.. బెర్రీలు, చెర్రీస్, ద్రాక్ష, పుట్టగొడుగులు, బ్రోకలీ, టమోటాలు. ఆరోగ్యకరమైన కొవ్వులు అవకాడోలు, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్.
Aamir Khan
అమీర్ ఖాన్ ఫాలో అయిన ఈ పద్ధతి అద్భుతమైన ఫలితాలను ఇచ్చిన మాట వాస్తవమే. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుందని, శరీరం తేలికగా మారుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. క్రాష్ డైట్‌లు లేదా జిమ్‌లకు వెళ్లలేని వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. అయితే, ఈ డైట్ వల్ల అమీర్ ఖాన్‌కు మైగ్రేన్ తగ్గడంతో పాటు బరువు తగ్గడం అనే రెండు ప్రయోజనాలు కలిగాయి. కానీ ఇది అందరికీ ఒకేలా పని చేయకపోవచ్చు. ప్రతి వ్యక్తి శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటాయి.
మీరు కూడా అమీర్ ఖాన్ లాగా ఈ డైట్ ఫాలో అయ్యి బరువు తగ్గాలని అనుకుంటే, ముందుగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. నిపుణుల సలహా లేకుండా ఆహారంలో భారీ మార్పులు చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సరైన పర్యవేక్షణలో ఈ డైట్ పాటిస్తే మైగ్రేన్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడమే కాకుండా, సహజంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అమీర్ ఖాన్ తన ఫిట్‌నెస్‌తో మరోసారి అందరికీ ఆదర్శంగా నిలిచారు. జిమ్‌కి వెళ్లడం మాత్రమే కాదు, మనం తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని శాసిస్తుందని ఆయన నిరూపించారు.