Aamir khan ex wife Kiran Rao Net Worth: 16 ఏళ్ల వైవాహిక జీవితానికి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు స్వస్తి పలుకుతూ.. ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాము కలిసి ఉండలేమని.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని ఇద్దరూ కలిసి శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే ఇంతకాలం కిరణ్ రావు.. అమీర్ ఖాన్ భార్యగా ఉండవచ్చు.. కానీ ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది. కిరణ్ రావు.. నిర్మాత, స్క్రీన్ రైటర్, దర్శకురాలిగా సత్తాచాటి.. తన కష్టంతో ఉన్నత స్థానానికి చేరుకుంది. ఆమె చాలా మంది నటులు నటీమణుల వలె చేతినిండా సంపాదిస్తుంది. తన సంపాదన మొదలైన నాటినుంచి ఆమె ఎన్జీఓ సంస్థలకు కూడా సాయం చేస్తూ వస్తోంది. అయితే.. కిరణ్ రావు, అమీర్ ఖాన్ విడిపోయిన నేపథ్యంలో చాలామంది ఆమె నేపథ్యం, వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాటిల్లో ఆస్తులు ఒకటి. ఇప్పుడు కిరణ్ రావు ఆస్తులు ఈ కింది విధంగా ఉన్నాయి.
మీడియా నివేదికల ప్రకారం.. కిరణ్ రావు నికర ఆస్తుల విలువ సుమారు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. మహిళా దర్శకురాలిగా కిరణ్ అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా పేరును గడించారు. అంతేకాకుండా అమీర్ ఖాన్‌కు చాలా సూపర్హిట్ సినిమాలను సైతం అందించారు. దీంతోపాటు మీడియా నివేదికల ప్రకారం.. అమీర్ ఖాన్ మొత్తం ఆస్తులు సుమారు 1,434 కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా. ఇక ఆయన ఒక చిత్రానికి రూ .85 కోట్ల వరకూ వసూలు చేస్తారని పేర్కొంటున్నారు. అయితే.. కిరణ్‌కు విలాసవంతమైన ఇల్లు, సొంతంగా ఖరీదైన వాహనాలు ఉన్నాయి. కిరణ్ తనకు ఇల్లు, వాహనాలు ఉన్నాయని మాత్రం ఎక్కడా స్పష్టం చేయలేదు. మీడియా నివేదికల ప్రకారం.. కిరణ్ ఆస్తులు 20 మిలియన్లు.. అంటే 146 కోట్లుగా 2020లో అంచనా వేశారు.
2005 డిసెంబర్ 28న అమీర్ ఖాన్, కిరణ్‌ల వివాహం జరిగింది. ఆ తర్వాత అద్దె గర్భం ద్వారా 2011లో వీరికి బాబు (ఆజాద్) పుట్టాడు. కిరణ్ నిర్మాతగా, స్క్రీన్ రైటర్, దర్శకురాలుగా చెరిగిపోని ముద్రవేసుకున్నారు. ‘జానే తు.. యా జానే నా’, ‘ధోబీ ఘాట్’, ‘దంగల్’, ‘తలాష్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’, ‘పీప్లి లైవ్’ వంటి చిత్రాలను ఆమె నిర్మించారు. దీనితో పాటు ధోబీ ఘాట్‌కు కూడా దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్స్ వైఫ్స్‌లల్లో ఆమె ఒకరిగా పేరును సంపాదించుకున్నారు.
Also Read: