Aadhi Pinisetty & Nikki Galrani: యువ హీరో ఆది పినిశెట్టి, కన్నడ హీరోయిన్ నిక్కీ గల్రానీలు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో త్వరలోనే ఏడడుగులు నడవనున్నారీ లవ్ బర్డ్స్. ఈక్రమంలోనే మార్చి 24న ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఈనెల 18న చెన్నైలో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారు. కాగా ఇప్పటివరకు తమ పెళ్లి విషయాలను సీక్రెట్‌గా ఉంచిన ఈ జంట తాజాగా తమ వివాహ వేడుకకు సంబంధించిన విషయాలపై ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘మా వివాహానికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినిమా పరిశ్రమలోని స్నేహితులకు మాత్రమే ఆహ్వనం అందించాం. చాలా కొద్ది మంది సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరగనుంది. అయితే మీ అందరి ఆశీర్వాదాలు, దీవెనలు లేకుండా ఈ వేడుక పూర్తికాదు. అందుకే ఈ ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారీ లవ్‌బర్డ్స్.
కాగా ఈ పెళ్లికొచ్చే అతిథుల గురించి ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ఆది పినిశెట్టి, స్టార్ హీరో అజిత్‌ను కలిసిన ఓ ఫొటో నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ వెళ్లి మరీ అజిత్‌ను కలవడం పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈనేపథ్యంలో మే18న జరిగే తన పెళ్లికి అజిత్‌ను ఆహ్వానించేందుకే ఆది వెళ్లి ఉండాలని తెలుస్తోంది. కాగా ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆతర్వాత సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం, అజ్ఞాతవాసి సినిమాల్లో నటించి మెప్పించాడు. కాగా నిక్కీతో కలిసి పలు సినిమాల్లో నటించాడీ యంగ్ హీరో. ఈక్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
Wished @nikkigalrani & @AadhiOfficial all the best at their pre-wedding, get together for the media. pic.twitter.com/iJeb7qg1ef
— Sreedhar Pillai (@sri50) May 14, 2022
.@AadhiOfficial & @nikkigalrani kickstart their wedding celebrations with a press meet now in Chennai.
They say their wedding will be a very private affair with their family, close frnds & industry colleagues. They say their marriage will be incomplete without media’s blessings pic.twitter.com/mIA8BZYXSv
— Kaushik LM (@LMKMovieManiac) May 14, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: