NTR Koratala Shiva: విద్యార్థి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎన్టీఆర్‌..? నెట్టింట వైర‌ల్ అవుతోన్న‌ తాజా అప్‌డేట్‌..

|

May 01, 2021 | 12:23 PM

NTR Koratala Shiva: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 2016లో వ‌చ్చిన ఈ సినిమా ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది...

NTR Koratala Shiva: విద్యార్థి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎన్టీఆర్‌..? నెట్టింట వైర‌ల్ అవుతోన్న‌ తాజా అప్‌డేట్‌..
Ntr Koratala Shiva New Movie
Follow us on

NTR Koratala Shiva: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 2016లో వ‌చ్చిన ఈ సినిమా ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌ళ్లీ 5 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ వీరి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న‌విష‌యం తెలిసిందే.
ఎన్టీఆర్ 30వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొర‌టాల శివ ప్ర‌స్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఈ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్త ప్ర‌కారం.. ఈ సినిమా రాజ‌కీయాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయ‌కుడిగా క‌నిపిస్తాడ‌ని, రాజ‌కీయాల కార‌ణంగా విద్యార్థుల భ‌విష్య‌త్తు పాడ‌వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో బ‌రిలోకి దిగే పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న అభిమానులు అడ‌పాద‌డ‌పా కోరుకుంటున్న త‌రుణంలో ఇలాంటి క‌థాంశంతో సినిమా రానుంద‌న్న వార్త‌లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: వైరల్, ఇలా కూడా జరుగుతుందా ? ఆ మమ్మీ ఈజిప్ట్ మత గురువుది కాదు, అది గర్భిణీ అట !

Nirav Modi: భారత్‌కు అప్పగించొద్దు.. నాకు న్యాయం జరగదు.. యూకే హైకోర్టులో నీరవ్ మోదీ పిటిషన్

pawan kalyan : అనుకున్న సమయానికి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందా..? టెన్షన్ లో ఫ్యాన్స్