72nd National Film Awards 2026: ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం.. హాజరవుతున్న సినీ ప్రముఖులు
జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలను దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 72వ జాతీయ ఫిల్మ్ అవార్డుల వేడుక సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో జరుగుతున్నాయి. ఈ వేడుకకు హాజరయ్యేందుకు సినీ ప్రముఖులు భారీగా తరలి వస్తున్నారు.

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలైన జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక జరుగుతుంది. దేశవ్యాప్తంగా విభిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలకు చెందిన సినిమాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, చిత్రాలను ఈ అవార్డులు ప్రతి ఏడాది సత్కరిస్తాయి. తాజాగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం మొదలైంది. ప్రస్తుతం రెడ్ కార్పెట్ పై సినీ ప్రముఖులు, టెక్నీషన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. తమ సినిమా కోసం పడిన కష్టాన్ని అలాగే ప్రేక్షకులు తమ సినిమాలను ఎలా ఆదరించారో పంచుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో విజేతలకు అవార్డులను ప్రధానం చేయనున్నారు. ఈ వేడుకకు భారీగా ప్రేక్షకులు, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. 2024లోని భారతీయ సినిమా ప్రతిభను గుర్తిస్తూ ప్రకటించిన ఈ అవార్డులను నేడు ( 22న) గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో రాష్ట్రపతి ప్రదానం చేస్తున్నారు.
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సృజనాత్మకతను జాతీయ స్థాయిలో చాటిచెప్పే వేదికగా ఈ పురస్కారాలు నిలుస్తున్నాయి. జాతీయ చలనచిత్ర అవార్డులను 1954లో ఏర్పాటు చేశారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఈ అవార్డుల ప్రస్థానంలో భారతీయ సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు ప్రముఖులు ఈ గౌరవాన్ని అందుకున్నారు. సినిమా నిర్మాణంలో నటన, దర్శకత్వం వంటి అనేక విభాగాలతో పాటు కెమెరా, ఎడిటింగ్, సంగీతం, సౌండ్ వంటి సాంకేతిక విభాగాల్లోనూ ప్రతిభను గుర్తించి జాతీయ చలనచిత్ర అవార్డులు అందజేస్తారు.
బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే
జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రధానంగా మూడు విభాగాలుగా పరిగణిస్తారు. అవి ఫీచర్ ఫిల్మ్స్, నాన్-ఫీచర్ ఫిల్మ్స్, సినిమా రచన. ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో దేశంలోని వివిధ భాషల్లో తెరకెక్కిన కథా చిత్రాలకు అవార్డులు లభిస్తాయి. నాన్-ఫీచర్ విభాగంలో డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్ తదితర చిత్రాల్లో ప్రతిభను గుర్తిస్తారు. ఇక సినిమా గురించి రచనలు, విశ్లేషణలు అందించే రచయితలను కూడా ప్రత్యేకంగా సత్కరిస్తారు. కాగా తెలుగు నుంచి ‘కల్కి’, ’35 – చిన్న కథ కాదు’ చిత్రాలకు అవార్డులు దక్కనున్నాయి.
బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళాను.. సీరియల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




