West Bengal Election 2021: బెంగాల్ దంగల్.. ఏ పార్టీది విజయం?.. సర్వేలు ఏం చెబుతున్నాయి?..

|

Mar 25, 2021 | 5:06 AM

West Bengal Election 2021: దేశ వ్యాప్తంగా త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. ప్రధానంగా..

West Bengal Election 2021: బెంగాల్ దంగల్.. ఏ పార్టీది విజయం?.. సర్వేలు ఏం చెబుతున్నాయి?..
Mamatha Vs Modi
Follow us on

West Bengal Election 2021: దేశ వ్యాప్తంగా త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. ప్రధానంగా పశ్చిమబెంగాల్ పేరుతో దేశంలో మారుమోగుతోంది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నువ్వా, నేనా సై అంటూ ఒకరిపై ఒకరు కాలు దువ్వుతున్నారు. బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్టానం.. సర్వశక్తులూ ఒడ్డుతోంది. దేశ వ్యాప్తంగా తమ పార్టీలో ఉన్న ప్రముఖ వ్యక్తులను బెంగాల్‌లో దింపి ప్రచారం సాగిస్తోంది. దాదాపు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలందరూ పశ్చిమ బెంగాల్‌లోనే మకాం వేశారంటే బెంగాల్‌ ఎన్నికలను ఎంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

కేంద్ర మంత్రులు, పార్టీలో ఉన్న సెలబ్రిటీలు, పేరున్న నేతలను ప్రచార పర్వంలోకి దింపింది. ఇప్పటికే బీజేపీ దిగ్గజాలు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు పలు దఫాలుగా బెంగాల్‌లో ప్రచారం సాగిస్తున్నారు. ఇదిలాఉంటే.. బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం సాగిస్తోంది. టీఎంపీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నీ తానై ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను చీల్చి చెండాడుతున్నారు. తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇలా అటు దీదీ.. ఇటు మోదీ ప్రచారంలో బెంగాల్ మోత మోగిపోతోంది. దాంతో దేశ ప్రజలందరి దృష్టి బెంగాల్ ఎన్నికలపైనే ప్రధానంగా కేంద్రీకృతమై ఉంది.

ఇదిలాఉంటే.. ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు 8 విడతల్లో జరగబోయే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై ఒపీనియన్ పోల్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. కొన్ని సంస్థలు టీఎంసీ గెలుస్తుందంటే.. మరికొన్ని సంస్థలు బీజేపీకే పట్టం కట్టబోతున్నారంటూ అంచనా వేస్తున్నాయి. ఇక 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే 147 స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంది. అన్ని స్థానాలు వస్తే గానీ.. ప్రభుత్వాన్ని చేజిక్కించుకోలేరు. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందో.. ఏ పార్టీ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయో.. ఒపీనియన్ పోల్స్ ఏం అంచనా వేస్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్:
బీజేపీ- 160
తృణమూల్- 112
లెఫ్ట్ కూటమి- 22

సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్స్:
బీజేపీ- 135
తృణమూల్- 141
లెఫ్ట్ కూటమి- 16

పీపుల్స్ పల్స్ ఒపీనియన్ పోల్స్:
బీజేపీ- 183
తృణమూల్- 93
లెఫ్ట్ కూటమి- 16

Also read:

Amazon: మొబైల్ కోనుగోలుదారులకు బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్‌ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండి.. అదెలాగంటే..

Election Campaign: ఎన్నికల ప్రచారంలో రెచ్చిపోయిన నేత.. డ్రమ్ముల్లా మారుతున్నారంటూ మహిళలను కించపరుస్తూ కామెంట్స్..