West Bengal TV9 Exit Poll Result 2021: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏయే పార్టీలకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.? ఏ పార్టీ విజయం సాధిస్తుంది.? ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి. అక్కడి అధికారపక్షాలు మరోసారి పీఠాన్ని దక్కించుకుంటాయా..? లేదా విపక్షాలు విజయం సాధిస్తాయా.. అనేదే అంతటా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి కళ్లు ఉన్నాయి. రెండు సార్లు అధికారాన్ని సొంతం చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ మరోసారి పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధిస్తుందా..? లేక బీజేపీ గెలుస్తుందా.? అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. టీఎంసీ నుంచి అంతా తానై.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి వరకు పోరాటం చేయగా.. బీజేపీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా లాంటి ప్రముఖులు ముందుండి నడిపించారు. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. దీంతోపాటు కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి కూడా బరిలో ఉన్నా.. అంతగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే.. టీవీ9 నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో పలు కీలకాంశాలు వెల్లడయ్యాయి. మళ్లీ దీదీకే పట్టం కట్టేలా ఓటర్లు కనిపిస్తున్నారు. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుందని తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి హేమాహేమీలు ప్రచారం నిర్వహించనప్పటికీ.. బెస్ట్ సీఎం మమతా బెనర్జీనే అంటూ చాలా మంది ఎన్నికలకు ముందే వెల్లడించడం విశేషం. అయితే టీవీ9 ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక మంది అధికార తృణముల్‌కే జై కొట్టారు. కాగా బీజేపీ కూడా దాదాపుగా అత్యధిక శాతం సీట్లను సాధిస్తుందని తెలుస్తోంది. కాగా.. కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి అంతగా ప్రభావం చూపెట్టలేకపోయింది. దీంతోపాటు అత్యధికమంది మహిళలు టీఎంసీ వైపే మొగ్గు చూపారు. టీవీ9 నిర్వహించిన సీ ఓటర్ సర్వేలో 43.90 శాతం మంది టీఎంసీకి ఓటేశామని చెప్పగా.. బీజేపీ 40.50 శాతం, కాంగ్రెస్-లెఫ్ట్ కూటమికి 10.70శాతం, ఇతరులు 4.90 శాతం అవకాశముందని వెల్లడించారు.
టీఎంసీ: 152 నుంచి 162 సీట్లు
బీజేపీ: 115 నుంచి 125
కాంగ్రెస్ – లెఫ్ట్ కూటమి: 16 నుంచి 26 సీట్లు
అయితే టీవీ9 నిర్వహించిన సర్వేలో అత్యధికమంది మహిళలు, ముస్లింలు టీఎంసీ వైపే మొగ్గు చూపారు. ఆ వివరాలు ఇలా..
మహిళల అభిప్రాయం ఇలా..
బీజేపీ – 38.10%
టీఎంసీ – 45.20%
కాంగ్రెస్ – వామపక్షాలు -9.90%
ఇతరులు- 6.80%
పురుషుల అభిప్రాయం..
బీజేపీ – 42.90%
టీఎంసీ – 42.60%
కాంగ్రెస్ – వామపక్షాలు -11.50%
ఇతరులు- 3.00%
ఎస్సీ-ఎస్టీలు
బీజేపీ – 58.10%
టీఎంసీ – 29.40%
కాంగ్రెస్ – వామపక్షాలు – 7.90%
ఇతరులు- 4.60%
ముస్లింలు..
బీజేపీ – 14.00%
టీఎంసీ – 70.00%
కాంగ్రెస్ – వామపక్షాలు – 14.10%
ఇతరులు- 1.90%
హిందువులు, ఇతరులు..
బీజేపీ – 49.50%
టీఎంసీ – 32.40%
కాంగ్రెస్ – వామపక్షాలు – 10.00%
ఇతరులు- 8.10%
ఇలా టీవీ9 నిర్వహించిన సర్వేలో.. కాంగ్రెస్, లెఫ్ట్ కూటమికి 10.70 శాతం ఓట్లు రాగా.. బీజేపీకి 40.50 శాతం ఓట్లు, అధికార టీఎంసీకి 43.90శాతం ఓట్లు, ఇతరులు 4.90 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దీదీకే పట్టం కట్టినట్లు చూపిస్తుండగా.. మే 2న అసలు ఫలితాలు వెలువడనున్నాయి. ఏదీఏమైనప్పటికీ మరలా టీఎంసీ.. అధికారాన్ని చేపడుతుందా.. లేక బీజేపీ పాగా వేస్తుందా అనేది తెలియాలంటే.. ఆదివారం వరకు ఆగాల్సిందే.
మరిన్ని ఇక్కడ చూడండి: West Bengal Exit Poll Results 2021 LIVE:: ఉత్తరాధిన పాగా వేసేది ఎవరు..? పశ్చిమ బెంగాల్ , అస్సాం ఎన్నికల ఎగ్జిట్ పోల్స్