Tamil Nadu Elections 2021: తమిళనాడులో బీజేపీ నేత ఖుష్బూ సుందర్ గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 6వ తేదీన తమిళనాట ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. థౌజెండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న ఖుష్బూ సుందర్ ఆ మేరకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ముందు ఖుష్బూ తన అనుచురులతో రోడ్ షో నిర్వహించారు.
ఖష్బూ ఆస్తులు ఎంతంటే..
తమిళనాడులోని థౌజెండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్న ఖుష్బూ గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌లో తనకు రూ. 22.55 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఖష్భూ స్థిరాస్తులు రూ.17.99 కోట్లు కాగా, ఆమె భర్తకు సంబంధించి స్థిరాస్తులు రూ. 16.57 కోట్లు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో వ్యవసాయేతర భూములు, ప్లాట్స్, నివాస భవనాలు ఉన్నాయి. తెలంగాణలోనూ నివాస భవనాలు ఉన్నట్లు ఖుష్బూ తన నామినేషన్లో పేర్కొన్నారు. అలాగే ఖుష్బూ భర్త సుందర్ పేరిట రూ. 4.55 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే.. ఆమె పేరిట రూ. 3.45 కోట్ల అప్పులు ఉండగా, తన భర్త పేరిట రూ.5.55 కోట్ల అప్పులు ఉన్నట్లు ఖుష్బూ తన నామినేషన్ పత్రాల్లో తెలిపారు. ఇక ఖుష్బూపై నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌లో ఆరేళ్ల పాటు కొనసాగించి సినీ నటి ఖుష్బూ.. ఆ పార్టీని వీడి గతేడాది అక్టోబర్ నెలలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
Also read: