Tamil Nadu Election 2021: యువతకు వరాలు ప్రకటించిన కమల్ హాసన్.. ఎంఎన్ఎం మేనిఫెస్టో విడుదల

|

Mar 19, 2021 | 6:12 PM

Kamal Haasan Releases MNM Manifesto: తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో అంతటా హాడావుడి నెలకొంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తూ.. ఎన్నికలను మరింత హీట్

Tamil Nadu Election 2021: యువతకు వరాలు ప్రకటించిన కమల్ హాసన్.. ఎంఎన్ఎం మేనిఫెస్టో విడుదల
Follow us on

Kamal Haasan Releases MNM Manifesto: తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో అంతటా హాడావుడి నెలకొంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తూ.. ఎన్నికలను మరింత హీట్ పెంచుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునకేందుకు ఇప్పటికే అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పలు వరాలను ప్రకటించాయి. ఈ క్రమంలోనే శుక్రవారం కమల్‌ హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం పార్టీ సైతం మేనిఫెస్టోను ప్రకటించింది. ఈ మేరకు కమల్ హాసన్ కోయంబత్తూర్‌లో జరిగిన కార్యక్రమంలో మేనిఫెస్టోను ప్రకటించారు. తన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని నగరాల్లో మోనోరైల్‌ను తీసుకువస్తానని ఆయన ప్రకటించారు. దీంతోపాటు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాలను ప్రకటించారు.

గృహిణుల ఆదాయం పెంచుతూ మహిళా సాధికారతకు బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు ప్రతినెలా రూ 10,000 నుంచి రూ 15,000 వరకూ సంపాదించుకునేలా పలు శిక్షణలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు.. యువతకు 50 లక్షల ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. యువ వాణిజ్యవేత్తలకు రాయితీలు కల్పిస్తామని, యువత అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని.. ఉచిత విద్య అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రభుత్వ కార్పొరేషన్లలో ఉద్యోగులను వాటాదారులుగా చేర్చితే అవి లాభాలబాట పడతాయని పలు అంశాలను ప్రస్తావించారు.

కాగా.. ఎంఎన్‌ఎం ఆలోచనలను డీఎంకే కాపీ కొట్టిందని.. తమ విజన్‌ను హామీల డాక్యుమెంట్‌లో పొందుపరిచిందని కమల్‌ హాసన్‌ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే.. ఇదిలాఉంటే తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

Also Read:

Political Parties: రాజకీయ పార్టీలకు విరాళాల వెల్లువ.. జాతీయ స్థాయిలో బీజేపీ.. ప్రాంతీయంగా టీడీపీ