Maharashtra Results: మహారాష్ట్రలో మహాయుతి కూటమి మహా ప్రభంజనం.. మరోసారి అధికారం దిశగా ఎన్డీయే
మహారాష్ట్ర ఎన్నికల్లో మహిళా ఓటర్లు, మరాఠాలు, ఓబీసీలు కులాల ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మహాయుతి హామీ ఇచ్చిన ఉచిత పథకాలు కూడా ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థం అవుతోంది.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి మహా ప్రభంజనం సృష్టించింది. డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే 220 సీట్లలో మహాయుతి లీడ్‌లో కొనసాగుతుంది. అటు మహావికాస్ అఘాడీ మాత్రం 53 సీట్లలోనే ఆధిక్యత ప్రదర్శిస్తోంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహిళా ఓటర్లు, మరాఠాలు, ఓబీసీలు కులాల ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మహాయుతి హామీ ఇచ్చిన ఉచిత పథకాలు కూడా ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థం అవుతోంది. దీంతో.. 50శాతానికి పైగా ఓట్లను సాధించింది మహాయుతి కూటమి.
ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇప్పటికే అమలులో ఉన్న లడ్‌కీ బెహన్ పథకం 15వందల నుంచి 2వేల 100కి పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. లడ్‌కీ బెహన్ కింద మహిళలకు మూడు నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇక వృద్ధాప్య పెన్షన్ రూ.15 వందల నుంచి రూ. 2వేల 100కి పెంచుతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. మహారాష్ట్రలో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది బీజేపీ కూటమి. అలాగే రైతులకు షెట్కారీ సమ్మాన్ యోజన కింద ఏటా రూ.15వేలు ఇస్తామని చెప్పింది. MSPపై 20 శాతం సబ్సిడీతో పాటు.. విద్యార్థులకు 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.
మహిళలకు నెలకు రూ.3వేలు, ఉచిత్ బస్ సదుపాయం. 3లక్షల రుణమాఫీ, 4వేల నిరుద్యోగ భృతి, కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా లాంటి కీలక హామీలను మహావికాస్ అఘాడీ సైతం ఇచ్చినా ఇవేమీ మరాఠా ప్రజలు విశ్వసించలేదని తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..