యూడీఎఫ్, ఎల్డీఎఫ్ నేతలు సంస్కృతిసాంప్రదాయాలను కాలరాస్తున్నారు.. కేరళ ప్రచారంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
కేరళలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల అగ్ర నేతలంతా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీజేపీ తరపున ప్రచారం నిర్వహించారు.
Kerala Election 2021: కేరళలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల అగ్ర నేతలంతా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీజేపీ తరపున కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటమిపై విరుచుకుపడ్డారు ప్రధాని. రకరకాల స్కాంలకు కేరళ అడ్డాగా మారిందన్నారు మోదీ. కేరళలో నిజమైన అభివృద్ది జరగాలంటే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములు ప్రజలతో సంబంధాలను కోల్పోయాన్నారు.
త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పతనంతిట్టలో జరిగిన భారీ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. స్వామియే శరణం అయ్యప్ప అని మోదీ అనడం అందరిని ఆకర్షించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… కేరళలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ఓటుబ్యాంక్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. సోలార్ స్కాం, గోల్డ్ స్కాం, ల్యాండ్ స్కాం ఇలా కేరళలో అనేక స్కాంలు జరిగాయన్నారు మోదీ. అయ్యప్ప భక్తులను కేరళ ప్రభుత్వం అనవసరంగా వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు.
#WATCH | These parties (of UDF & LDF) are ashamed of the culture of our land. Their leaders abuse our traditions & ethos. LDF govt should be ashamed of showering lathis on innocent devotees. UDF should be ashamed of remaining silent when this was happening: PM Modi in Palakkad pic.twitter.com/Ci9Ec1ZGVe
— ANI (@ANI) March 30, 2021
పాలక్కడ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అధికార ఎల్డీఎఫ్‌పై విమర్శలు గుప్పించారు. కేరళలో పెను దుమారం రేపి.. ఎల్డీఎఫ్ మెడకు చుట్టుకున్న గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ వ్యవహారంలో అధికార పార్టీని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. కొంత వెండి కోసం లార్డ్ జీసస్‌ను జుడాస్ మోసం చేసినట్టుగా.. కొంత బంగారం కోసం కేరళను అధికార ఎల్డీఎఫ్ మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు.
యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి ప్రజలకు తెలిసిందని, రానున్న ఎన్నికల్లో ఈ రెండు కూటములు ప్రజల తిరస్కరణకు గురికాక తప్పదని ఆయన చెప్పారు. కేరళ రాజకీయాల్లో చాలా సంవత్సరాలుగా ఒక రహస్యం దాగి ఉందని, అదే యూడీఎఫ్, ఎల్డీఎఫ్ స్నేహపూర్వక ఒప్పందమని ప్రధాని చెప్పుకొచ్చారు.. త్వరలో జరగనున్న రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీకి మీ ఆశీస్సులు కోరుతూ ఇక్కడికి వచ్చానని, ప్రస్తుతం కేరళలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా ఓ విజన్‌తో తాను వచ్చానని ప్రధాని ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
లెఫ్ట్ పార్టీలు కేరళలో ఇప్పటికీ చాలాసార్లు అధికారంలోకి వచ్చాయని, కానీ ఇప్పటికీ ఆ పార్టీల నేతలు మాత్రం జూనియర్ లెవెల్ గూండాల్లానే ప్రవర్తిస్తుంటారని మోదీ ఎద్దేవా చేశారు. లెఫ్ట్ పార్టీల పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు పెరిగిపోయాయని, హత్యలు పెరిగాయని ఆయన ఆరోపించారు. కేరళలో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే ఈ హింసకు స్వస్తి పలుకుతామని ప్రధాని ఓటర్లకు హామీ ఇచ్చారు.