Political Party Symbols: రాజకీయ పార్టీని స్థాపించడం ఎలా.. ఎన్నికల గుర్తును ఎలా కేటాయిస్తారు..

|

Mar 29, 2024 | 6:12 PM

శరద్ పవార్‌కు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ‘నేషనల్ కాంగ్రెస్‌ పార్టీ-శరద్‌చంద్ర పవార్‌’ పార్టీ పేరును ఉపయోగించుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. దీంతో పాటు ఆయన పార్టీ ఎన్నికల గుర్తు 'బాకా వాయించే వ్యక్తి' గా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌ను కోర్టు ఆదేశించింది.

Political Party Symbols: రాజకీయ పార్టీని స్థాపించడం ఎలా.. ఎన్నికల గుర్తును ఎలా కేటాయిస్తారు..
Party Symbols
Follow us on

శరద్ పవార్‌కు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ‘నేషనల్ కాంగ్రెస్‌ పార్టీ-శరద్‌చంద్ర పవార్‌’ పార్టీ పేరును ఉపయోగించుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. దీంతో పాటు ఆయన పార్టీ ఎన్నికల గుర్తు ‘బాకా వాయించే వ్యక్తి’ గా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌ను కోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించిన కోర్టు ఈ ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం ఏ పార్టీకి కేటాయించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో అజిత్ పవార్ వర్గం షాక్‌కు గురైంది.

అటువంటి పరిస్థితిలో, ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల గుర్తులను ఎలా కేటాయిస్తుంది. ఒక పార్టీ ఏదైనా ఎన్నికల గుర్తును డిమాండ్ చేయగలదా.. పార్టీని ఎలా నమోదు చేసుకుంటారు.. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి ఏవైనా షరతులు ఉంటాయా అన్న విషయాలు ఇప్పుడు గమనిద్దాం.

ఎన్నికల గుర్తు ప్రక్రియ ఇలా..

ఎన్నికల గుర్తులను పార్టీలకు కేటాయించాలని చట్టం కూడా ఉంది. ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్, కేటాయింపు) ఆర్డర్, 1968 కింద, ఎన్నికల సంఘం పార్టీలకు చిహ్నాలను జారీ చేస్తుంది. అయితే దాని కోసం కూడా కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరిస్తుంది. 100కు పైగా ఎన్నికల చిహ్నాలు ఎన్నికల సంఘం వద్ద రిజర్వ్‌లో ఉన్నాయి. వీటిని ఇంకా ఏ పార్టీకి కేటాయించలేదు. ఎన్నికల చిహ్నాలను జారీ చేసే విషయానికి వస్తే, కమీషన్ పార్టీకి ఒక గుర్తును జారీ చేస్తుంది. అయితే, ఏదైనా పార్టీ నిర్దిష్ట ఎన్నికల గుర్తును జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తే, ఎన్నికల సంఘం దానిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ ఎన్నికల గుర్తు ఏ పార్టీకి కేటాయించకుంటే అప్పుడు జారీ చేయవచ్చు. ఒకవేళ జారీ చేసింటే అదే గుర్తును తీసుకునేందుకు అవకాశం ఉండదు.

ఇవి కూడా చదవండి

ఎన్నికల గుర్తుపై వివాదం ఏంటి..

ఎన్నికల గుర్తును జారీ చేసేందుకు ఒక ప్రక్రియ ఉంది. ఇదే క్రమంలో దానిపై గత కొంత కాలంగా ఒక వివాదం ఉంది. కమిషన్ ఇకపై జంతువులు, పక్షుల ఫోటోలతో ఎన్నికల చిహ్నాలను జారీ చేయదు. దీనిపై అనిమల్ రైట్స్ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి గుర్తులు ఉన్న పార్టీలు ఎన్నికల సమయంలో ఆ జంతువులను ఊరేగించేవి. దీనిపై అనిమల్ రైట్స్ సంఘాల ప్రతినిధులు నిరసనలు చేశారు. గొంతు లేని జంతువుల కవాతును క్రూరత్వంగా, తప్పుగా అభివర్ణించారు. ఆ తరువాత, ఎన్నికల సంఘం జంతువుల గుర్తులను జారీ చేయడాన్ని నిషేధించింది.

EC నుండి ఎలా గుర్తింపు పొందాలి?

ఒక అభ్యర్థి రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే, దానిని ఎన్నికల కమిషన్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజకీయ పార్టీల ఏర్పాటుకు సంబంధించిన కొన్ని నిబంధనలను అనుసరించాలి. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలంటే ఎన్నికల సంఘం జారీ చేసిన ఫారమ్‌ను నింపాల్సి ఉంటుందని. ఇది మొదటి నిబంధన. దీన్ని ఆన్‌లైన్‌లో నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని ప్రింటవుట్‌ తీసుకుని ఇతర ముఖ్యమైన పత్రాలతో పాటు 30 రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు పంపాలి. ప్రక్రియలో, కొంత నగదు రూ. 10,000 డిపాజిట్ చేయాలి.

పార్టీ పెట్టాలంటే ఈ షరతులు తప్పనిసరి..

పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందు, రాజ్యాంగంలోని విధానాన్ని గుర్తుంచుకోవడం తప్పనిసరి. ఇందులో రాజకీయ పార్టీ పేరు ఏమిటి, దాని పని తీరు ఎలా ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు అనే విషయాలు నమోదు చేయబడ్డాయి. ఇలా ఎన్నో విషయాలు అందులో నమోదయ్యాయి. అందుకే రాజ్యాంగాన్ని అనుసరించి ఈ ప్రక్రియను కొనసాగించాలి. దీంతో పాటు, పార్టీలో ముఖ్యమైన పదవులు నిర్వహిస్తున్న వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. వారి సంతకాలు కూడా పార్టీ రాజ్యాంగం కాపీపై తప్పనిసరిగా చేయించాలి. పార్టీకి సంబంధించి ఒక బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. వాటి పూర్తి వివరాలను కూడా పత్రాల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పార్టీ పేరు ఏమిటనేది అభ్యర్థులే నిర్ణయిస్తారని, అయితే అది ఆమోదం పొందుతుందా లేదా అనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఆ పేరు ఇప్పటికే నమోదు చేయబడిందా లేదా అని కమిషన్ తనిఖీ చేస్తుంది. అది రిజిస్టర్ చేయబడితే కచ్చితంగా తీసుకోవచ్చు. రాజకీయ పార్టీని స్థాపించాలంటే అందులో కనీసం 500 మంది సభ్యులు ఉండాలి. ఆ సభ్యులు ఏ ఇతర పార్టీతోనూ సంబంధం పెట్టుకోకూడదు. దీని కోసం, ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాలి. ఇది సభ్యుడు ఏ ఇతర రాజకీయ పార్టీతో సంబంధం లేదని నిర్ధారిస్తుంది.

మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..