ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.

  • Balaraju Goud
  • Publish Date - 8:34 pm, Thu, 1 April 21
ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు
Ap Zptc Mptc Election Notification Released

ap zptc mptc election notification: ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈ నెల 10న పరిషత్‌ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ నీలం సాహ్ని.. వరుస భేటీలతో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఇవాళ రాజకీయ పార్టీలతో మీటింగ్‌ పెట్టారు. ఆ తర్వాతే ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వుుల జారీ చేశారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.

Ap Zptc Mptc Election Notification 2021

Ap Zptc Mptc Election Notification 2021

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబుతో సమీక్ష చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఆ తర్వాత ఎన్నికల సంఘం ఆఫీసులో నీలం సాహ్నిని కలిశారు సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్‌. వీలైనంత త్వరగా పరిషత్‌ ఎన్నికలు పెట్టాలని కోరారు. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికలు అడ్డంకిగా ఉన్నాయని, వెంటనే పూర్తి చేస్తే వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయవచ్చని వివరించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో సీఎం జగన్‌ సైతం ఇదే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు పరిషత్‌ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు నీలం సాహ్ని. భద్రత. పోలింగ్‌, కౌంటింగ్‌ ఏర్పాట్లపై సమీక్షించారు. ఇంకోవైపు ఇవాళ రాజకీయ పార్టీలతో భేటీ ఏర్పాటు చేశారు ఎస్ఈసీ. పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే… ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. స్తారని తెలుస్తోంది. అయితే పాత షెడ్యూల్‌ను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది.

ఇదిలావుంటే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లలో ఏకగ్రీవాలకు గత నెలలోనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది హైకోర్టు. వెంటనే డిక్లరేషన్‌ ఫారాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పుతో పాత షెడ్యూల్‌ను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం. గత ఏడాది 652 జెడ్పీటీసీ సీట్లలో 126 ఏకగ్రీవం అయ్యాయి. 526 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాలి. మొత్తం 9,693 ఎంపీటీసీ సీట్లలో 2,248 ఏకగ్రీవం అయ్యాయి. 7,445 ఎంపీటీసీ సీట్లకు ఎన్నికలు జరగాలి. ఏకగ్రీవాలు జరిగిన చోట డిక్లరేషన్‌ ఫారాలు ఇచ్చేయాలని గత నెలలోనే ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

దీంతో తాజాగా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరనుంది. అనవరమైతే ఈనెల 9వ తేదీన రీపోలింగ్ జరపనున్నారు. ఇక ఈనెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కౌటింగ్ చేపడతారు. అదే పూర్తి ఫలితాలను వెల్లడించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

పరిషత్ ఎన్నిలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ కోసం ఇది క్లిక్ చేయండి

Read Also… Pawan Kalyan: ముగ్గురు రత్నాల చేతులో పవర్ స్టార్ పవన్.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న పవన్..