UP Elections: ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురవుతున్నాయి.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ సంచలన ఆరోపణ

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(UP Assembly Elections) ఫలితాలకు ముందు సవాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ట్యాంపరింగ్ కు గురవుతున్నాయన్నారు. అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండానే...

UP Elections: ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురవుతున్నాయి.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ సంచలన ఆరోపణ
Akhilesh

Updated on: Mar 09, 2022 | 7:19 AM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(UP Assembly Elections) ఫలితాలకు ముందు సవాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ట్యాంపరింగ్ కు గురవుతున్నాయన్నారు. అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండానే ఈవీఎం (EVM)లు రవాణా చేస్తున్నారని, ఇది దొంగతనం లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాని సూచించారు. అయోధ్యలో తమ పార్టీ విజయం సాధిస్తుందని భాజపా భయపడుతోందని వ్యాఖ్యానించారు. వారణాసిలో స్థానిక అభ్యర్థులకు సమాచారం లేకుండానే ఈవీఎంలను రవాణా చేశారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు సమయంలో మోసాలకు పాల్పడితే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ, మిత్రపక్షాల అభ్యర్థులు తమ కెమెరాలతో రెడీగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యం కోసం కౌంటింగ్ సమయంలో యువత సైనికులుగా మారాలని కోరారు.

ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను 8 జనవరి 2022న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటిలో యూపీలో ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించగా, తుది ఓటింగ్ మార్చి 7, 2022న ముగిసింది. ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి. అంతకు ముందు, రాజకీయ విశ్లేషకులు వారి వారి ‘గణాంకాలతో సీట్లను అంచనా వేస్తున్నారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు తప్పు అని నిరూపించడం కూడా జరిగింది. అయినప్పటికీ, ఈ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఫలితాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. లోక్‌సభకు అత్యధిక సంఖ్యలో ఎంపీలను పంపిన ఈ రాష్ట్ర ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల పరిస్థితిని కూడా నిర్ణయించనున్నాయి.

Also Read

Malavika Mohanan: తెలుగులో ఓ భారీ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న మాస్టర్ బ్యూటీ..

Beauty Tips: పెళ్లికి ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే మీ అందం చెదిరిపోతుంది..!

Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!