Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం.. ఆధారాలు ఇవే

80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం జరిగినట్టు ఆధారాలు కనుగొన్నారు పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు. ఉత్తర భారతంలో ఉన్న సోన్ నది సమీపంలో ఇటీవల కొందరు..
Early humans lived in northern India, 80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం.. ఆధారాలు ఇవే

80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం జరిగినట్టు ఆధారాలు కనుగొన్నారు పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు. ఉత్తర భారతంలో ఉన్న సోన్ నది సమీపంలో ఇటీవల కొందరు పురావస్తు శాఖ అధికారులు దాబా అనే ప్రాంతం నుంచి కొన్ని రాతి పనిముట్లను సేకరించారు. వాటిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌లో మానవుల సంచారం ఎప్పుడు మొదలైందన్నదానిపై క్లారిటీ ఇచ్చారు.

దాదాపు 80 వేల ఏళ్ల క్రితమే ఇండియాలో మానవులు సంచరించినట్లు తమ స్టడీలో తేలిందన్నారు. వస్తువులు లేదా ఆహారపదార్థాలను ముక్కలుగా కోసేందుకు ఆది మానవులు రాళ్లతో తయారైన పనిముట్లను వాడినట్లు నిర్థారించారు. మధ్యరాతి యుగంలో నియాండర్‌తాల్(ఆదిమానవులు) వాడిన పనిముట్ల తరహాలోనే ఇవి కూడా వారు ఓ అభిప్రాయానికి వచ్చారు. అయితే అప్పుడు సంచరించిన మానవులు ఈ జాతి వారు అవునా.. కాదా.. అన్న అంశాన్ని మాత్రం తేల్చలేకపోయారు. మరి వీటిని ఎలా కనుగొన్నారు అని సందేహం వచ్చింది కదా. ‘లుమినిసెన్స్’ అనే టెక్నిక్ ద్వారా ఆ రాతి పనిముట్లను అధ్యయనం చేయడం ద్వారా.. వాటి కాలాన్ని అంచనా వేశారు.

అయితే.. సుమత్రా దీవుల్లోని దాదాపు 75 వేల ఏళ్ల సంవత్సరాల క్రితం పేలిన ‘తోబా అగ్నిపర్వతం’ సంఘటనను కూడా పరిగణనలోకి తీసుకున్నారు పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు. ఈ అగ్నిపర్వతం పేలిన ఫలితంగా దట్టమైన రాళ్లు, ధూళితో సమీప ప్రాంతమంతా నిండిపోయింది. ఆ రాళ్లన్నీ భారత ఉపఖండంలో పడ్డాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా కొంతమంది ఆదిమానవులు చనిపోయి ఉండవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆఫ్రికా నుంచి వలస వచ్చిన మానవులకు, సెంట్రల్ ఇండియాకు లింకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏదేమైనా ఆదిమానవుల జాతికి సంబంధించిన సరికొత్త విషయాలు ఇప్పుడు బయట పడటం విశేషం.

Early humans lived in northern India, 80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం.. ఆధారాలు ఇవే

ఇది కూడా చదవండి: పండ్ల తోటలను నాశనం చేస్తోన్న కొత్త వైరస్.. ఏపీలో మొదటి కేసు!

Related Tags