ఓ యువకుడు తనను మోసం చేశాడని న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి కృష్ణా జిల్లాలో ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌కి చెందిన యువతి ఏలూరులో బీటెక్ చదువుతుంది. ఈ క్రమంలో ఆమెకు అదే ప్రాంతానికి చెందిన సాయి చైతన్య అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా.. ఆపై ప్రేమగా మారింది.
అయితే సాయి చైతన్య నాలుగు సంవత్సరాలు నుంచి ప్రేమించానని చెప్పి తనను మోసం చేసి శారీరకంగా అనుభవించాడని ఆమె ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసినట్లు వెల్లడించింది. యువతి ఫిర్యాదుతో సాయి చైతన్యపై హనుమాన్ జంక్షన్ పీఎష్‌లో కేసు నమోదైంది. తనని ప్రేమించాననే విషయం ఎవరికైనా చెప్పినా, ఫోటోలు ఎవరికైనా చూపించినా నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తానని సాయి చైతన్య బెదిరిస్తున్నట్లు ఆమె చెబుతోంది. చావనైనా చస్తా కానీ తనకు న్యాయం జరిగేవరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంటానని యువతి భీష్మించుకోని కూర్చుంది. పోలీసులు ఆమెకు సర్ది చెప్పి.. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.
Also Read:
విద్యుత్ షాక్‌తో చేపలు పడుతున్న మత్స్యకారులు.. పెను ప్రమాదమని హెచ్చరిస్తోన్న అధికారులు