Crime news: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు…ఒళ్లంతా మంటలతో పోలీస్ స్టేషన్ లోకి దూసుకొచ్చి..
సరిగ్గా అర్ధరాత్రి. నైట్ డ్యూటీలో ఉన్న తక్కువ మంది పోలీసులతో ఆ పోలీస్ స్టేషన్ ప్రశాంతంగా ఉంది. ఉన్నట్టుండి వేగంగా దూసుకొచ్చిన యువకుడు. అతని శరీరమంతా మంటలు. గాలి వేగానికి ఆ మంటలు...
సరిగ్గా అర్ధరాత్రి. నైట్ డ్యూటీలో ఉన్న తక్కువ మంది పోలీసులతో ఆ పోలీస్ స్టేషన్ ప్రశాంతంగా ఉంది. ఉన్నట్టుండి వేగంగా దూసుకొచ్చిన యువకుడు. అతని శరీరమంతా మంటలు. గాలి వేగానికి ఆ మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలియక పోలీసులు నిశ్చేష్ఠులయ్యారు. వెంటనే తేరుకుని మంటలు ఆర్పారు. ఆనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్(Bhilaspur) లో నివాసముండే సమీర్ ఖాన్.. కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అతనికి కొంత కాలం క్రితం ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో తనకు డబ్బు అవసరం ఉందని, తిరిగి ఇచ్చేస్తానని నమ్మించిన యువతి సమీర్ ఖాన్ నుంచి లక్షా ఎనభై వేల రూపాయలు తీసుకుంది.
నెలలు గడుస్తున్నా… యువతి డబ్బులు తిరిగివ్వలేదు. వివాహం చేసుకోవాలని కోరినా ఆమె తిరిస్కరించేది. యువతి చర్యలతో విసిగిపోయిన సమీర్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదు. నెలల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా.. ఫలితం కనిపించలేదు. ఓపిక నశించిన సమీర్ ఖాన్… తన డబ్బులు తిరిగివ్వాల్సిందేనని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అయినప్పటికీ యువతి నుంచి సమాధానం లేదు. చెప్పిన విధంగా ఓ సారి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సమీర్ ఖాన్ ను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. అనంతరం సమీర్ ఖాన్ ఆస్పత్రి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడి పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో అర్ధరాత్రి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లాడు. ఊహించని హఠాత్పిరిణామానికి అవాక్కైన పోలీసులు… బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
Also Read
Telangana SSC Exam 2021: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక వార్షిక పరీక్షల్లో ఆరు పేపర్లే
Naga Chaitanya : హర్రర్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో అలరించనున్న అక్కినేని కుర్ర హీరో
Indian Army: విషాదం.. హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి.. ధ్రువీకరించిన ఆర్మీ