ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిపై రాళ్ల దాడి.. తీవ్ర గాయాలతో చికిత్సపొందుతున్న యువకుడు
కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో యువతి తరుపు బంధువలు అబ్బాయిపై అతి కిరాతకంగా దాడి చేశారు.
Young man honor attacked : సూర్యాపేట జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో యువతి తరుపు బంధువలు అబ్బాయిపై అతి కిరాతకంగా దాడి చేశారు. యువతి, యువకులు కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో.. పెద్దలు వారి పెళ్లికి ససేమిరా అన్నారు. దీంతో వారిని ఎదురించి హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కాగా.. యువతి తండ్రి తన కూతురు పెళ్లి చేసుకోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు.
కూతురు నచ్చని పెళ్లి, అదీ వేరే కులం వ్యక్తిని చేసుకుందన్న దురహంకారం ఆమె తల్లిదండ్రుల్లో పెరిగిపోయింది. అంతే.. ఆవేశంతో, రాళ్లు అందుకున్నారు. కూతురు పెళ్లి చేసుకున్న వ్యక్తిని చావబాదారు. వాళ్లు కొట్టిన దెబ్బలకి చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నాడు ఆ వ్యక్తి ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.
గరిడేపల్లి మండలం మర్రికుంటకు చెందిన వినయ్, పెన్‌పహాడ్ మండలం దూపహాడ్‌కు చెందిన రుచిత ఇద్దరూ ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలను ఒప్పించలేక.. ఇటీవల హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని రుచిత తల్లిదండ్రులు.. కులదురహంకారంతో ఒక్కసారిగా వినయ్‌పై దాడికి తెగబడ్డారు. చచ్చేదాకా కొట్టారు. చివరికి చచ్చిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న అతన్ని స్థానికులు ఆసుపత్రికి చేర్చారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య వినయ్ కొట్టుమిట్టాడుతున్నాడని బంధువులు తెలిపారు.
ఇదీ చదవండి… సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆటో – జీపు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి