AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gurugram: తైవాన్ మహిళపై యువకుడి అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దారుణం.. చివరికి

దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అడ్డుకట్ట పడటం లేదు. దేశంలోని మహిళలపైనే కాకుండా విదేశాలకు చెందిన వారిపై కూడా ఇలాంటి ఘటనలు...

Gurugram: తైవాన్ మహిళపై యువకుడి అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దారుణం.. చివరికి
Harassment
Ganesh Mudavath
|

Updated on: Jul 26, 2022 | 8:18 PM

Share

దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అడ్డుకట్ట పడటం లేదు. దేశంలోని మహిళలపైనే కాకుండా విదేశాలకు చెందిన వారిపై కూడా ఇలాంటి ఘటనలు జరుగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గురుగ్రామ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు తైవాన్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, 53 ఏళ్ల తైవాన్ మహిళపై 29ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. తైవాన్ దేశానికి చెందిన ఓ మహిళ.. 2017 నుంచి గురుగ్రామ్‌లో నివసిస్తోంది. ఆమెకు రవీంద్ర విశ్వకర్మ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతను సెక్టార్ 52లోని పేయింగ్ గెస్ట్ సమీపంలో నివాసముండేవాడు. వీరిద్దరూ తరచూ మట్లాడుకోవడంతో ఇరువురి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో రవీంద్ర ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారనికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని కోరితే.. అతను నిరాకరించాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని, అతణ్ని సిటీ కోర్టులో హాజరు పరుస్తామని స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి