AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇండియాలో చిట్టచివరి రోడ్డును ఎప్పుడైనా చూశారా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు

మనం భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ.. ఈ దేశం గురించి మనకు పూర్తిగా తెలియదు. ఇండియా భౌగోళికంగా ప్రపంచంలో ఏడో అతిపెద్ద దేశం కాగా, జనాభా పరంగా చైనా తర్వాత రెండో స్థానంలో ఉందన్న విషయం మాత్రం తెలుసు. అయితే దేశంలో నివసించే...

Viral Video: ఇండియాలో చిట్టచివరి రోడ్డును ఎప్పుడైనా చూశారా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు
Indias Last Road Video
Ganesh Mudavath
|

Updated on: Jul 26, 2022 | 4:56 PM

Share

మనం భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ.. ఈ దేశం గురించి మనకు పూర్తిగా తెలియదు. ఇండియా భౌగోళికంగా ప్రపంచంలో ఏడో అతిపెద్ద దేశం కాగా, జనాభా పరంగా చైనా తర్వాత రెండో స్థానంలో ఉందన్న విషయం మాత్రం తెలుసు. అయితే దేశంలో నివసించే ప్రజలకు తెలియని దేశానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. దేశంలో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉంది. కానీ భారతదేశంలోని చివరి రహదారి ఎక్కడ ఉందో, అది ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఆశ్చర్యం కలిగిస్తాయి. భారతదేశంలోని చివరి రహదారి ఎక్కడ ఉందో మీకు తెలుసా? తెలియకపోతే.. ఈ వీడియో చూసేయండి. దేశంలోని చివరి రహదారి ధనుష్కోడి అని పిలువబడే తమిళనాడులోని నిర్జన గ్రామంలో ఉంది. ఈ గ్రామం భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్న భూ సంబంధమైన సరిహద్దు. ఇది పాక్ జలసంధిలో ఇసుక దిబ్బపై ఉంటుంది. ఈ గ్రామం భారతదేశంలోని చివరి భూమిగా పిలువబడుతోంది.

కాగా.. ఈ రోడ్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో రోడ్లు, దాని పరిసరాలు చాలా అందంగా కనిపిస్తాయి. డ్రోన్ ద్వారా చూస్తేఒక పెద్ద శివలింగంలా కనిపిస్తుంది. ట్విట్టర్‌లో షేర్ చేసిన కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల 46 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది ప్రజలు వీడియోను లైక్ చేసి కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..