Rashtrapati Bhavan: అడుగడుగునా అద్భుతాలే.. రాష్ట్రపతి భవన్ ను ఓ సారి చుట్టేద్దామా.. వైరల్ గా మారిన కేంద్ర మంత్రి వీడియో
రాష్ట్రపతి భవన్‌ను (Rashtrapati Bhavan) ఎప్పుడైనా చూసారా.. దేశాధినేతలందరి బంగ్లాలకంటే భారత రాష్ట్రపతి అధికారిక నివాసం అతిపెద్దది. ఈ భవన గొప్పదనాన్ని చాటుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు....
రాష్ట్రపతి భవన్‌ను (Rashtrapati Bhavan) ఎప్పుడైనా చూసారా.. దేశాధినేతలందరి బంగ్లాలకంటే భారత రాష్ట్రపతి అధికారిక నివాసం అతిపెద్దది. ఈ భవన గొప్పదనాన్ని చాటుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్రపతి భవన్ గొప్పతనాన్ని చాటుతూ సాగిన ఈ వీడియోలో రాష్ట్రపతి భవన్‌లోని ఆయా విభాగాలు, వాటి విస్తీర్ణం, వంటి వాటిని పొందుపరిచారు. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము జూలై 25న పదవీ ప్రమాణం చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా (Viral) మారింది. ప్రపంచంలోని అన్ని దేశాల అధినేతల బంగ్లాలను పరిగణనలోకి తీసుకుంటే, రాష్ట్రపతి భవన్ వాటన్నింటిలోకి అతి పెద్దదిగా నిలుస్తుందని కిషన్ రెడ్డి ఓ కామెంట్‌ను జత చేశారు. ఆరున్నర నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో రాష్ట్రపతి భవన్‌లోని గార్డెన్ల నుంచి అందులోని వివిధ కార్యక్రమాల కోసం నిర్దేశించిన ప్రాంగణాల గురించి వివరించారు. అయితే.. 330 ఎకరాల్లో ఇంగ్లీష్ అక్షరం H ఆకారంలో రాష్ట్రపతి భవన్ నిర్మించారు. ఈ నాలుగు అంతస్థుల భవనంల మొత్తం 340 గదులు ఉంటాయి. నిర్మాణంలో పూర్తిగా భారతీయ సంప్రదాయ నిర్మాణ శైలి అనుసరించారు.
Rashtrapati Bhawan – The World’s largest residence of any Head of the state.
ఇవి కూడా చదవండిGlimpses:@rashtrapatibhvn pic.twitter.com/whcEyws6cX
— G Kishan Reddy (@kishanreddybjp) July 25, 2022
రాష్ట్రపతి నిలయంలో దాదాపు 190 ఎకరాల్లో రకరకాల పూలతోటలు ఉంటాయి. అరుదైన వృక్ష, పుష్ప జాతులకు ఈ ప్రాంతం అలవాలం. రాష్ట్రపతి భవన్‌లో మొత్తం 64 లివింగ్ రూమ్స్ ఉంటాయి. భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా మొఘల్, బౌద్ధ నిర్మాణాల తరహాలో ఈ భవనం నిర్మించారు. రాష్ట్రపతి సేవ, నిర్వహణ కోసం 200మంది వరకు పనిచేస్తూ ఉంటారు. రాష్ట్రపతి భవన్ లో ఉన్న హాల్స్‌లో దర్బార్ హాల్, అశోక హాల్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడి డైనింగ్ రూమ్‌లో అతి పొడవైన డైనింగ్ టేబుల్ ఉంది. 104 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే అవకాశం ఉంటుంది.
ఇలా ఎన్నో అద్భుతాలకు రాష్ట్రపతి భవన్ అలవాలం. రాష్ట్రపతి భవన్ ఆవరణలోకి వెళ్లినా భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు అడుగడుగునా పలకరిస్తాయి. ఎన్నో అద్భుతాలకు కేరాఫ్ గా మారిన రాష్ట్రపతి నివాస సముదాయంలోకి ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా అడుగు పెట్టబోతున్నారు.