ఫేస్‌బుక్‌లో ప్రేమ.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని వేరు కాపురం.. అంతలోనే విషాదం..!
పైకి కనిపించేవన్నీ నిజాలు భావించి నమ్మి నట్టేట మునుగుతున్నారు యువతీ యువకులు. ప్రేమ పేరుతో మరో యువతి మోసపోయింది. కుటుంబ పెద్దలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Young Woman Suicide : పైకి కనిపించేవన్నీ నిజాలు భావించి నమ్మి నట్టేట మునుగుతున్నారు యువతీ యువకులు. ప్రేమ పేరుతో మరో యువతి మోసపోయింది. కుటుంబ పెద్దలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదిన్నర కాకముందే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. పుత్తూరులో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సౌజన్య(27) అనే యువతి తన ఇంట్లోనే ఉరి వేసుకొన్న సంఘటన బుధవారం పుత్తూరులో జరిగింది.
స్థానిక పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్ పరిచయం ప్రేమ ఆ తరువాత పెళ్లికి వెళ్లింది. పుత్తూరు పట్టణానికి చెందిన బాలచంద్ర(30) అనే వ్యక్తి గుంటూరు నగరానికి చెందిన సౌజన్యతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. రెండేళ్ల పా టు ఫేస్‌బుక్ ద్వారా ప్రేమను పంచుకున్న వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు పెద్దలు అంగీకరించకపోవడంతో వారికాదని ఏడాదిన్న క్రితం వివాహం చేసుకున్నారు.
ఇద్దరూ కలిసి పుత్తూరులోని మండపం వీధిలో కాపురం పెట్టారు. బాలచంద్ర పుత్తూరులో ని మాత్ర ఫార్మసీలో పనిచేసేవాడు. అయితే, గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇద్దరు తరుచు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో సౌజన్య బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. గుంటూరులోని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also… కొత్త వ్యవసాయ చట్టాలపై వెనక్కు తగ్గని కేంద్రం.. పట్టువదలని రైతులు.. ఈ నెల 26న భారత్ బంద్