ఎలక్షన్‌ డ్యూటీకి వెళ్లిన మహిళ కరోనాతో మృతి.. ఒంటరివారైన ఆమె భర్త, 8 ఏళ్ల కూతురు.. వివరాలు ఇలా..

|

May 20, 2021 | 7:27 PM

Woman Dies With Corona : ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల విధులకు వెళ్లిన ఉపాధ్యాయురాలు కరోనాకు గురై మృతిచెందారు.

ఎలక్షన్‌ డ్యూటీకి వెళ్లిన మహిళ కరోనాతో మృతి.. ఒంటరివారైన ఆమె భర్త, 8 ఏళ్ల కూతురు.. వివరాలు ఇలా..
Woman Dies With Corona
Follow us on

Woman Dies With Corona : ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల విధులకు వెళ్లిన ఉపాధ్యాయురాలు కరోనాకు గురై మృతిచెందారు. రాజకీయాలు, ఎన్నికలతో జీవితాలు నాశనమైన 15 కుటుంబాలలో వీరిది ఒకటి. దీంతో ఆమె భర్త , వారి 8 సంవత్సరాల కుమార్తె ఒంటరివారయ్యారు. సంధ్యకు ఏప్రిల్ 20 న జ్వరం వచ్చింది. తరువాత పరీక్షలు చేయిస్తే పాజిటివ్ అని తేలింది. వారం తరువాత, ఆమెను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసియులో చేర్పించారు. కానీ ఆమె పరిస్థితి విషమించడంతో మే 8 న మరణించింది. భార్య మరణంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు భర్త కమ్మంపతి మోహన్ రావు. వారి 8 సంవత్సరాల పాప తల్లి లేనిదయ్యింది.

అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా కోవిడ్ -19 బారిన పడిన 500 మంది ఉపాధ్యాయులను కోవిడ్ యోధులుగా గుర్తించి పరిహారం చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. మహమ్మారి సమయంలో ఎన్నికలు నిర్వహించడాన్ని, ప్రభుత్వం తీసుకున్న చర్యను కరోనా సోకిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన మోహన్ రావు, పోలింగ్ రోజున అనేక మంది కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘించారని ఆరోపించారు.

30 మందికి పైగా పోలింగ్ సిబ్బందిని బస్సులో ఎక్కించి పోలింగ్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఐదుగురు పోలింగ్ సిబ్బంది, నలుగురు పోలింగ్ ఏజెంట్లతో సహా కనీసం పది మంది పోలింగ్ సమయంలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఒక చిన్న ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో కూర్చున్నారని చెప్పారు. తెలంగాణ హైకోర్టు దీనిని సుమోటోగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో కనీసం 15 మంది ఉపాధ్యాయులు మరణించారని, వారిలో వందలాది మంది పోల్ డ్యూటీ సమయంలో పాజిటివ్ పరీక్షలు చేయించుకోకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం అని పేర్కొంది.

Tv9

వారిద్దరూ కలవడానికి కరోనా సాయపడింది.. దాదాపు 33 సంవత్సరాల తర్వాత తండ్రిని కలుసుకున్న కూతురు..

Cattle Shed Ablaze: మేడిచర్ల పాలెంలో దారుణం.. పశువులపాకకు నిప్పు పెట్టిన తోటికోడళ్లు..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..