AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలో మరో ఘోరం.. రేపల్లె రైల్వే స్టేషన్‌లో భర్తను కొట్టి భార్యపై గ్యాంగ్ రేప్..

Repalle Railway Station: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల (Bapatla district) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని దుండగులు మహిళపై

AP News: ఏపీలో మరో ఘోరం.. రేపల్లె రైల్వే స్టేషన్‌లో భర్తను కొట్టి భార్యపై గ్యాంగ్ రేప్..
Ap Crime News
Shaik Madar Saheb
|

Updated on: May 01, 2022 | 9:15 AM

Share

Repalle Railway Station: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల (Bapatla district) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని దుండగులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు అడ్డుపడిన భర్తను కొట్టి.. ఆ తర్వాత వలస కూలీపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముగ్గురు కలిసి అత్యాచారం (Woman gang-raped) చేసినట్లు బాధిత దంపతులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. రాత్రి రైల్వే స్టేషన్లో వేచి ఉన్న సమయంలో ముగ్గురు దుండగులు అక్కడి వచ్చారని.. అనంతరం తన భర్తను కొట్టి.. ప్లాట్‌ఫాంపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంటోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. బాధితులను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాగా.. అవనిగడ్డలో పనుల కోసం భార్యభర్తలిద్దరూ నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వేస్టేషన్‌లో దిగారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోని బల్లల మీద పడుకున్నారని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు బల్లపై నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. వారికి అడ్డుపడ్డ భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు తెలిపారు. నిందితులను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

CJI NV Ramana: న్యాయ వ్యవస్థ బలోపేతానికే నిర్ణయాలు.. తెలంగాణ సీఎస్ తీరుపై సీజేఐ ఆగ్రహం..

AP Crime News: అంతా మాయ..! సత్తుపల్లి టు సత్తెనపల్లి.. తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీ కలకలం..