
హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తి… నాలాలో శవమై తేలింది. ఈ విషాదకర ఘటన గడ్డిఅన్నారం డివిజన్‌లోని సరూర్ నగర్ చెరవు కట్ట సమీపంలో చోటు చేసుకుంది. శారదానగర్‌కు చెందిన సరోజ(80) అనే మహిళ మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఆమె సరూరనగర్ చెరువు కట్ట కింద నాలాలో పడిపోయింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువు నిండుగా ఉండటంతో నాలాలో నీటి ప్రవాహాం ఎక్కువగా ఉంది. ఇది స్థానికులు గమనించేలోపే వృద్దురాలు నాలాలో మునిగి కొట్టుకుపోయింది. చివరికి చైతన్యపురి హనుమాన్ నగర్ నాలాలో మహిళ మృతదేహాన్ని కాలనీవాసులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.