Woman Committed Suicide: పెళ్లి రద్దయిందని యువతి ఆత్మహత్య.. ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని..

Woman Committed Suicide: పెళ్లి రద్దయిందని మనస్థాపంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్‌పేట్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అలియాబాద్‌కు చెందిన.

Woman Committed Suicide: పెళ్లి రద్దయిందని యువతి ఆత్మహత్య.. ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని..
Crime News
Follow us
Subhash Goud

|

Updated on: May 28, 2021 | 11:14 AM

Woman Committed Suicide: పెళ్లి రద్దయిందని మనస్థాపంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్‌పేట్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అలియాబాద్‌కు చెందిన లక్ష్మణ్‌ కూతురు అనూష(22) మూడుచింతలపల్లికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇటీవల వివాహం రద్దయింది. దీంతో అనూష పెళ్లి రద్దయిందని తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి శామీర్‌పేట పోలీసులు చేరుకొని పంచానామ నిర్వహించారు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి పెళ్లి రద్దు కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందా…? లేక ఇంకేమైన కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పిన ఎస్‌యూవీ వాహనం.. చిన్నారితో సహా ఐదుగురు దుర్మరణం

Fake Cowin Apps: వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ ఫోన్లకు మెసేజ్‌లు.. ఓపెన్ చేశారో అంతే సంగతలు..