Viral Video: లాక్‌డౌన్‌ సమయంలో మధ్యప్రదేశ్ పోలీసుల అరాచకం.. మాస్క్ పెట్టుకోలేదని ఓ మహిళను దారుణంగా కొట్టిన ఖాకీలు

|

May 20, 2021 | 11:11 AM

మధ్యప్రదేశ్ పోలీసులు మరోసారి తమ కర్కషత్వం చూపించారు. మాస్క్‌ ధరించ లేదనే కారణంతో మహిళపై  దారుణంగా దాడి చేశారు. పురుష అధికారితో పాటు ఓ లేడీ పోలీసు ఆఫీసర్‌ కూడా..

Viral Video: లాక్‌డౌన్‌ సమయంలో మధ్యప్రదేశ్ పోలీసుల అరాచకం.. మాస్క్ పెట్టుకోలేదని ఓ మహిళను దారుణంగా కొట్టిన ఖాకీలు
Woman Brutally Punched By
Follow us on

మధ్యప్రదేశ్ పోలీసులు మరోసారి తమ కర్కషత్వం చూపించారు. మాస్క్‌ ధరించ లేదనే కారణంతో మహిళపై  దారుణంగా దాడి చేశారు. పురుష అధికారితో పాటు ఓ లేడీ పోలీసు ఆఫీసర్‌ కూడా సదరు మహిళను కాళ్లతో తంతూ.. పిడిగుద్దులు గుద్దుతూ.. జుట్టుపట్టుకుని లాగి.. దారుణంగా కొట్టింది. ఆమెతోపాటు ఉన్న కూతురును కూడా పోలీసులు తమ ప్రతాపం చూపించారు. వారి చేతుల నుంచి బయటపడటానికి సదరు మహిళ ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సామాజిక మధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులపై నెటిజనులు మండిపడుతున్నారు. నిత్యవసర సరుకుల కోసం మార్కెట్‌కు వచ్చిన సామాన్యులపై ఇలా దాడి చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఓ మహిళ తన కుమార్తెతో కలిసి నిత్యవసర సరుకుల కోసం రోడ్డు మీదకు వచ్చింది. ఆ సమయంలో ఆమె మాస్క్‌ ధరించలేదు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు సదరు మహిళపై దాడి చేశారు. మహిళా పోలీసు కూడా వారితోపాటు కొట్టడం మొదలు పెట్టింది. తల్లిని కొడుతుండటంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురిని కూడా వారు కొట్టి పక్కకు నెట్టేశారు.

ఆ మహిళ ఏడుతూ కారణం చెప్పేందుకు ప్రయత్నించినా ఆ కరడుగట్టిన పోలీసులు వినిపించుకునే స్థితితో లేరు. కొడుతూనే పోలీస్ జీప్ ఎక్కించారు. రోడ్డు మీద వెళ్తున్నవాళ్లు ఈ అరచకాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి: కోళ్లలారీ బోల్తా సందులో సడేమియా ఎగబడ్డ జనాలు.. షాక్ లో లారీ డ్రైవర్.. లాభో దిభో అంటున్న ఓనర్ : Viral Video.

YSRCP VS JanaSena: గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. వైసీసీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ..