Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య.. కత్తితో

Woman brutally murdered: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో మరో దారుణ సంఘటన చోటుచేరకుంది. మహిళపై ఓ

Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య.. కత్తితో
Murder

Updated on: Jan 11, 2022 | 7:42 PM

Woman brutally murdered: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో మరో దారుణ సంఘటన చోటుచేరకుంది. మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి (murder) హత్య చేశాడు. ఈ ఘటన ఎస్సాఆర్ నగర్‌ పరిధిలోని ఎర్రగడ్డలో చోటుచేసుకుంది. తాజాగా ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. భర్తతో విడిపోయి ఒంటరిగా నివసిస్తున్న మహిళ (Woman) పై ఖలీల్ అనే వ్యక్తి కత్తితో నడిరోడ్డుపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖలీల్‌ అనే వ్యక్తి ఎర్రగడ్డ (Erragadda)లో రోడ్డుపై వెళ్తునన మహిళపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం మహిళ చనిపోయిందని భావించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమయంలో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మహిళను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆమె చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం పోలీసులు ఖలీల్‌ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Warangal: మద్యం షాప్ దగ్గర ఆగి ఉన్న ఇన్నోవా కారు.. అనుమానంతో డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!

Andhra Pradesh: హక్కుల కోసం పోరాటం చేస్తున్న తమ ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారంటూ పోలీసులకు మహిళాసంఘాలు ఫిర్యాదు..