Crime News: వేధింపులు తాళలేక భర్తను చంపిన భార్య.. రాడ్‌తో కొట్టి దారుణంగా..

Woman kills husband: తెలంగాణలోని హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఈ ఘటన హన్మకొండలోని రెడ్డి కాలనీలో

Crime News: వేధింపులు తాళలేక భర్తను చంపిన భార్య.. రాడ్‌తో కొట్టి దారుణంగా..
Man stabs wife

Edited By: Ravi Kiran

Updated on: Nov 22, 2021 | 12:17 PM

Woman kills husband: తెలంగాణలోని హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఈ ఘటన హన్మకొండలోని రెడ్డి కాలనీలో ఆదివారం రాత్రి జరిగింది. హన్మకొండ జిల్లా రెడ్డికాలనిలో నివాసం ఉంటున్న గన్నేరు శంకర్ మద్యానికి బానిసై తరుచూ భార్యతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో అతని వేధింపులు తట్టుకోలేక ఆదివారం రాత్రి భార్య.. తన సోదరుడి సహకారంతో భర్త శంకర్ ను హత్యచేసింది. రాడ్‌తో కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది. వేధింపులు తట్టుకోలేకనే హత్య చేసినట్లు వెల్లడించింది.

సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పలు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటన వరంగల్ పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారింది. పలు కోణాల్లో ఈ హత్య కేసును విచారిస్తున్నట్లు హన్మకొండ పోలీసులు వెల్లడించారు.

Also Read:

Ramagundam: అందరూ చూస్తుండగానే ప్రాణం తీసుకున్నాడు.. స్టేషన్‌లోనే రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..

CM KCR: కేంద్రంతో తేల్చుకునేందుకు ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. యాసంగి వరిధాన్యం కొనుగోళ్లపై ప్రధానిని కలిసే ఛాన్స్..